మీ లంగ్స్‌ మిమ్మల్ని ముందే అలర్ట్‌ చేస్తాయి.. ఇలా తెలుసుకోండి!

-

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్‌ బాధితుల సంఖ్యతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే, ఎవరైనా కరోనా బారిన పడితే, మన ఊపిరితిత్తులు మనల్ని ముందే హెచ్చరిస్తాయంటా! ఇది డయాబెటీస్‌తో బాధపడుతున్న కొవిడ్‌ బాధితుల్లో గుర్తించారంట. కరోనా బారిన పడి చనిపోయినవారు చాలా రోజులుగా ఊపిరితిత్తులకు గాయాలబారిన పడతాయి.

కానీ ఎలా? లంగ్స్‌ ఎఫెక్ట్‌ అవుతుందో తెలుసుకుందాం.
ఇటీవల పరిశోధనల ప్రకారం సార్స్, COV2 స్పైక్‌ ప్రోటీన్‌ల ద్వారా కొవిడ్‌ వైరస్‌ లక్షణాలు తెలుసుకోవచ్చు. లంగ్స్‌లో మంటగా ఉంటుందని తేల్చారు.

  • కరోనా వైరస్‌ నోరు, ముక్కు, కన్ను, వివిధా మార్గాల్లో సోకుతుంది. అప్పుడు అది ముందుగా శ్వాస సంబంధిత ప్రాంతంలో చేరుతుంది. ఊపిరితిత్తులతోపాటు గాలి తీసుకునే నాళాన్ని సైతం ఆక్రమిస్తుంది. ఈ క్రమంలో కొద్దిగా బాడీలో ఇరిటేషన్‌గా కూడా ఉండవచ్చు.

ఇన్ఫెక్షన్‌

  • దీని వల్ల వాయునాళాన్ని కూడా కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌ చేస్తుంది.
  • అందుకే, వైరస్‌ మన శరీరంలో చేరగానే కొన్ని రకాల లక్షణాలతో మనం సులభంగా గ్రహించవచ్చు. దీనివల్ల మనం ముందుగానే గ్రహించవచ్చు.
  • గొంతులో చికాకు, పొడిదగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ నిమోనియాతో బాధపడేవారు కూడా శ్వాసకోశ సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి.

గాలి తీసుకోవడంలో ఇబ్బంది

ఊపిరితిత్తుల్లో నొప్పిగా ఉండి, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారుతుంది. ఛాతిలో కూడా నొప్పి ఉండవచ్చు. యూఎస్‌ వర్జినియా యూనివర్సిటీ వారు కూడా ఎలుకపై ఈ ప్రయోగాన్ని చేసి, ద్రువీకరించారు.

వైరస్‌ బారినపడిన ఊపిరితిత్తులు

మామూలుగా ఉన్న లంగ్స్‌ కంటే వైరస్‌ బారిన పడిన ఊపిరితిత్తుల్లో మ్యాక్రోఫేజెస్‌ అనే ఇమ్యూనిటీ సెల్స్‌తో నిండి ఉంటాయి. శ్వాసనాళాన్నే కాకుండా వాయుమార్పిడి చేందే ప్రాంతాన్ని ఎఫెక్ట్‌ చేస్తుంది. లంగ్స్‌లో ఫ్రైబ్రోబ్లాస్ట్‌ సెల్స్‌ నిండిపోవటాన్ని ఫైబ్రోసిస్‌ అంటారు.
కరోనా వైరస్‌ వయస్సు, మగ, ఆడ అనే తేడా లే కుండా అందరిని ఎఫెక్ట్‌ చేస్తుంది. కానీ, వయస్సు ఎక్కువ ఉన్న ఇతర రుగ్మతలు కలిగిన వారిలో వైరస్‌ ప్రాణాంతకరమవుతుందని పరిశోధకులు తెలిపారు.

జాగ్రత్తలు

  • తరచూ మీ ఆక్సిజన్‌ లెవల్స్‌ను చెక్‌ చేసుకోవాలి. 94–100 మధ్య ఉండాలి.
  • రక్తంలో హెచ్‌బీ లెవల్‌ పరీక్షించుకోవాలి.
  • లంగ్స్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి. సైక్లింగ్, స్విమ్మింగ్, నడక అలవాటు చేసుకోవాలి.
  • ఎక్కువ అరటిపళ్లు, యాపిల్స్, టోమాటో, గ్రేప్స్‌ తినాలి.
  • యోగా అలవాటు చేసుకోవాలి. సుఖాసనం, భుజంగాసనం,మత్స్య ఆసనం, పద్మాసనం వంటివి చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version