మీది దొరల పాలన..మాది ప్రజాపాలన : కాంగ్రెస్ విమర్శలు

-

గత బీఆర్ఎస్ పాలనపై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి విమర్శలు గుప్పించింది. బీఆర్ఎస్‌ది దొరల పాలన అయితే .. తమది ప్రజా పాలన అని పేర్కొంది. గత ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపితే, తమ ప్రభుత్వం ఆయా శాఖలు పంపించిన టాక్స్ పెంపు ప్రతిపాదనలను తిరస్కరించిందని గుర్తుచేసింది.

ఈ మేరకు పన్నుల పెంపుపై గతంలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్‌ను తాజాగా రేవంత్ రెడ్డి పన్నుల భారం ప్రతిపాదనలను తిరస్కరించినట్లుగా తెలిసిందంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది. కాగా, గతంలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచబోతున్నామని, ఈ విషయంలో మాకెలాంటి శషభిషలు లేవంటూ గులాబీ బాస్ మాట్లాడిన వీడియోను పోస్టు చేసింది. ఆ పక్కనే ఈ రాష్ట్ర పునర్నిర్మినామంలో మా శాయశక్తుల కష్టపడతామంటూ సీఎం రేవంత్ చేసిన వీడియోను అటాచ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version