హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే.. రాత్రిపూట ఈ ఒక్కటీ ఫాలో అయితే సరిపోతుంది..!

-

చాలామంది ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇటువంటివి రాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. గుండె సమస్యలు రాకుండా ఉండడానికి.. హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకరమైన సమస్యలు రాకుండా ఉండడానికి ఇలా చేయాలని వాళ్ళు చెప్తున్నారు. హెల్తీగా ఉండడానికి నిద్ర చాలా ముఖ్యం. మంచి నిద్ర ఉంటే రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మంచి నిద్ర ముఖ్యం. మంచి నిద్ర వలన గుండెకి సంబంధించిన సమస్యలకు దూరంగా ఉండడానికి అవుతుంది. అలాగే పరిశోధనల ప్రకారం చూసినట్లయితే తక్కువసేపు నిద్రపోవడం వలన అది గుండెపై ప్రభావం చూపిస్తుందట.

కాబట్టి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం చాలా ముఖ్యం. హాయిగా మంచి నిద్రని పొందడం వలన ఆయుష్షు పెరుగుతుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. కొంతమంది రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయాన్నే వేగంగా నిద్ర లేస్తారు. అలా చేస్తే గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువ ఉంటుంది. ఏడు గంటల కంటే తక్కువసేపు నిద్రపోతే హైబీపీ సమస్య ఏడు శాతం పెరుగుతుంది.

ఐదు గంటలకంటే తక్కువసేపు నిద్రపోవడం వలన 11 శాతం గుండె జబ్బుల ప్రమాదం ఉంటుందట. కాబట్టి రాత్రి పూట త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోండి. రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు హాయిగా నిద్రపోయేటట్టు చూసుకోవాలి. తక్కువసేపు నిద్రపోవడం వలన హైబీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్టడీ చెప్తోంది. షుగర్ హై బీపీ వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం మొబైల్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండడం వలన హెల్తీగా ఉండొచ్చు. మంచి నిద్రని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version