భారతీయ సినీ ప్రేక్షకులకు ‘RRR’ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు ఈ చిత్రానికి వరించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా ప్రముఖులంతా ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
మరోవైపు ఈ పాటతో సంబంధమున్న టెక్నీషియన్లంతా వారి మనోభావాలను పంచుకుంటున్నారు. తాజాగా ఈ సాంగ్ రాసిన గీత రచయిత చంద్రబోస్ నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల స్పందించారు.
ఆర్ఆర్‌ఆర్ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కించుకున్న నేపథ్యంలో ఆ గీత రచయిత చంద్రబోస్ సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంలో మరచిపోలేని మధుర క్షణాలివని చెప్పారు. 3,500లకు పైగా పాటలు రాసిన తనకు.. ప్రతి పాట ఓ తపస్సు లాంటిదే అన్నారు. ఈ సారి ‘నాటు నాటు’ పాటకు చేసిన తపస్సుకు ఆ భగవంతుడే ప్రత్యక్షమై ఇచ్చిన వరం.. ఈ పురస్కారం అని చెప్పారు. తనకు అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Straight from Heart!!❤️
Lyricist @boselyricist speaks emotionally as #NaatuNaatu from #RRRmovie won #GoldenGlobes Award!!✨@mmkeeravaani @ssrajamouli @tarak9999 @alwaysramcharan #TeluguFilmnagar pic.twitter.com/SKWtn2WWy0— Telugu FilmNagar (@telugufilmnagar) January 11, 2023