నవంబర్ 1 వరకు వైఎస్ భాస్కరరెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు

-

వివేకానందారెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో చాలా రోజులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎస్కార్ట్ బెయిల్‌పై బయట ఉన్నారు. అయితే.. తాజాగా వైఎస్ భాస్కర రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్‌ను సీబీఐ న్యాయస్థానం పొడిగించింది. తన బెయిల్ పిటిషన్ పొడిగించాలని ఆయన సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నట్లు కోర్టుకు విన్నవించారు. వైద్యుల సూచన, తదుపరి చికిత్స కోసం తనకు ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్‌ను మరో రెండు నెలలు పొడిగించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం నవంబర్ 1 వరకు ఎస్కార్ట్ బెయిల్‌ను పొడిగించింది.

ఎస్కార్ట్ బెయిల్లో భాగంగా ముగ్గురు పోలీసులు, ఒక పోలీస్ వెహికిల్ ఉంటాయి. ఎస్కార్ట్ బెయిల్లో వీళ్లు భాస్కర్ రెడ్డి వెంటే ఉంటారు. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో.. ఈ ఏప్రిల్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని పులివెందులలో విచారించి.. నాటకీయ పరిణామాలు నడుమ అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సీబీఐ అధికారులు. అప్పటి నుంచి ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయగా.. గత నెల 20న ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. అంతకు ముందు ఉదయ్ కుమార్ రెడ్డికి కూడా సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ భార్య గర్భవతిగా ఉండడంతో ఆమెను కలిసేందుకు 14 నుంచి 16వ తేదీ వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version