ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎన్నికైనప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఏ ఒక్కరు కూడా జగన్ ని అభినందించడానికి ముందుకు రాలేదు. అటువంటి సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వైయస్ జగన్ నివాసం తాడేపల్లి కి వచ్చి జగన్ ని అభినందించడం జరిగింది. ఆ తర్వాత నుండి వైయస్ జగన్ గవర్నమెంట్ తీసుకున్న అనేక నిర్ణయాల విషయాలలో చిరంజీవి సపోర్ట్ చేయటం జరిగింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి వైసీపీ పార్టీ లోకి వస్తున్నట్లు అదేసమయంలో రాజ్యసభకు పార్టీ నుండి వెళ్తున్నట్లు వార్తలు అప్పట్లో వచ్చాయి.
అయితే ఈ విషయాలపై ఇటు జగన్ గాని అటు చిరంజీవి గానీ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఆ సమయంలో చిరంజీవి కచ్చితంగా జగన్ పార్టీలోకి వచ్చే ప్రసక్తే లేదని …ఎందుకంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ నష్టపోవడం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో కామెంట్ చేయడం జరిగింది. కానీ మరో పక్క మాత్రం చిరంజీవి వైసీపీకి కొద్దిగా సన్నిహితంగానే ఉంటున్నట్లు వ్యవహరించడం జరిగింది.
ఇదిలా ఉండగా ఇటీవల అమరావతి జేఏసీ తన ఇంటి ముందు ధర్నా చేయడానికి రెడీ అయిన క్రమంలో కూడా చిరంజీవి బయటకు వచ్చి మూడు రాజధానులు విషయంలో ఏమాత్రం స్పందించకపోవడం పట్ల జగన్ కి ఒళ్ళు మండినట్లు వైసిపి పార్టీ వర్గాల్లో టాక్. ముందు మూడు రాజధానుల విషయంలో స్టార్టింగ్ లో మాట్లాడిన చిరంజీవి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అని జగన్ వైసీపీ నేతలను ఆరా తీస్తున్నారట. దీంతో రాబోయే రోజుల్లో మెగా హీరో లకు సంబంధించి సినిమాల విషయాలలో కఠినంగా వ్యవహరించాలని జగన్ సర్కార్ డిసైడ్ అయినట్లు సమాచారం.