ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టడం జరిగింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిజెపి ఓడిపోయిన తర్వాత ప్రధాని మోడీ కలిసిన మొట్ట మొదటి వ్యక్తి వైఎస్ జగన్. మోడీ మరియు జగన్ భేటీ దాదాపు గంటకు పైగానే జరగటం అప్పట్లో జాతీయ రాజకీయాల్లో సంచలన వార్త అయింది. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రానికి తిరిగి వచ్చేసిన జగన్..తిరిగి ఢిల్లీ పర్యటన చేపట్టి కేంద్ర మంత్రులతో భేటీ కావడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలను మరియు నిధుల విషయం గురించి పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర పెద్దలతో వైయస్ జగన్ చర్చించినట్లు వైసిపి వర్గాలు చెప్పాయి. ఇలా ఉండగా తాజాగా చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకునే వైయస్ జగన్ విద్యుత్ పీపీఏల విషయంలో వ్యవహరించిన తీరును పరోక్షంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పు పట్టడం హాట్ టాపిక్ అయింది. విషయంలోకి వెళితే కేంద్ర మంత్రి పీయుష్ గోయల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దేశాన్ని భ్రష్టుపట్టిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.
సరాసరి ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోయినా, ‘దక్షిణాదిలో ఓ రాష్ట్రం పీపీఏలపై ప్రతిష్టంభన సృష్టించడంతో దేశం పరువు పోతోంది..’ అని ఆయన పేర్కొనడం.. పరోక్షంగా ఏపీని ఉద్దేశించిందేనన్నది జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో పీపీఏల విషయంలో వైయస్ జగన్ తీరు పట్ల కేంద్ర పెద్దలు ఫుల్ సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి చర్చించడానికి వైయస్ జగన్ ని ‘ అర్జెంట్ గా డిల్లీ రండి ‘ అంటూ కేంద్రం సీరియస్ పిలుపునిచ్చినట్లు వార్తలు వినబడుతున్నాయి.