ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. జూలై 2018 నుంచి పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని మంజూరు చేసింది. జనవరి 2021 జీతాలతో కలిపి ఫిబ్రవరి 1న నగదుగా చెల్లిస్తారు. 2018 జూలై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలల బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలను చెల్లిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, వారికి జనవరి నెల జీతంలో సమ భాగాలలో పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. సీపీఎస్ విషయానికి వస్తే వారికీ 30 నెలల బాకీలు 90 శాతం నగదుతో పది శాతం బ్యాంక్ కాతాకు మూడు సమభాగాల్లో జనవరి జీతాల చెల్లింపు తర్వాత జమ అవుతుంది. 2019 జనవరి డీఏ 2021 జూలై నుంచి.. 2019 జూలై డీఏ ..2022 జనవరి నుంచి ప్రభుత్వం చెల్లించనుంది.