అలా చేసిన వాళ్ళని వదిలేస్తే జగన్ కే బ్యాడ్ నేమ్ !

-

మందులేని కరోనా వైరస్ కి నియంత్రణ ఒకటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కట్టుదిట్టంగా లాక్ డౌన్ నీ అమలు చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో వైయస్ జగన్ నిరుపేదలను మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడానికి వెయ్యి రూపాయలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే. దీంతో ఇటీవల గ్రామ వాలంటీర్లు ఆ వెయ్యి రూపాయలు ప్రతి ఇంటికి పంచడం జరిగింది.అయితే ఈ సందర్భంలో వైసిపి నాయకులు కొందరు అత్యుత్సాహం చూపించి…ఈ డబ్బులను స్థానిక ఎన్నికలకు పార్టీ ఇచ్చిన డబ్బు గా ప్రోజెక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో రావడం జరిగాయి. గ్రామ వాలంటీర్లు డబ్బులు పేదలకు ఇస్తున్న టైములో వారితో పాటు వైసిపి నాయకులు స్థానిక ఎన్నికల్లో మీరు వైసీపీ కి ఓటు వేయాలి అంటూ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసిన న్యాయస్థానం అప్పట్లో తీర్పు ఇచ్చినా టైం లో ఎన్నికల కోడ్ ఎత్తివేసి ఎన్నికల ప్రచారం చేయకూడదు అని న్యాయస్థానం తేల్చి చెప్పడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలని కలెక్టర్లకు మరియు పరిశీలకులకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. పేద వాళ్లను ఆదుకోవడం కోసం జగన్ ఇచ్చిన ఈ వెయ్యి రూపాయలని ఆధారం చేసుకుని ఎవరైతే ప్రచారం చేశారో ఆ వైసీపీ ప్రజాప్రతినిధులను జగన్ కూడా వదల కూడదు అని చాలామంది అంటున్నారు. వాళ్లని వదిలేస్తే జగన్ కి ప్రభుత్వాని కి చెడ్డపేరు బ్యాడ్ నేమ్ వస్తుందని.., కాబట్టే జగన్ ఈ విషయంలో వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని చాలామంది సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version