ట్రంప్ అలిగినా, కోపం పెంచుకున్నా మనకే నష్టమా…!

-

కొన్ని కొన్ని వాస్తవాలు ఆత్మాభిమానం పక్కన పెట్టి అంగీకరించాలి. కాదు కూడదు లేదు అంటే కుదరదు. ఇప్పుడు అమెరికాతో మనకు చాలా అవసరం. మనకు విదేశాల నుంచి వచ్చే ఆదాయంలో సింహ భాగం వచ్చేది అమెరికా నుంచే. మన దేశంలో ఉద్యోగాల కొరత తీవ్రంగా ఉన్నా సరే మన దేశంలో ఖాళీగా ఉండే వాళ్ళు పది లక్షలు ఉంటే చాలు అమెరికా విమానం ఎక్కుతున్నారు. అక్కడ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు.

మన దేశంలో ఉన్న చాలా కారణాలతో అగ్ర కులాలకు ఉద్యోగాలు రావడం లేదు. దీనితో అందరూ కూడా ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాలు మొదలుకుని అన్ని ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీగా ఉన్నారు అమెరికాలో. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోసం మన దేశానికి ప్రచారానికి ట్రంప్ వచ్చారు అంటే ఏ స్థాయిలో అమెరికాలో మన వాళ్ళ ప్రభావం ఉందో అర్ధం చేసుకోవచ్చు.

గూగుల్ సహా అనేక ప్రముఖ కంపెనీల్లో మన వాళ్ళు ఉద్యోగాలు చేయకపోతే పరిస్థితి అక్కడ దారుణం. మనకు అక్కడ ఉద్యోగాలు లేకపోతే మన పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. వైద్య రంగం అయినా, ఐటి రంగం అయినా సరే అమెరికా మీద ఆధారపడే ఉంటాం మనం. రక్షణ రంగంలో మనం చైనాకు దీటుగా ఎదగాలి అంటే ఇప్పుడు అమెరికా అవసరం చాలా ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు.

అమెరికా అవసరాలు మనకు ఎక్కువ. ఆర్ధికంగా మన దేశం నిలబడాలి అంటే అమెరికా సాయం చాలా అవసరం. అలాగే ఐటి రంగం మన దేశం నిలబడాలి అంటే ఇదే ఊపుని కొనసాగించాలి అంటే కచ్చితంగా అమెరికా అవసరాలు ఉంటాయి. వాణిజ్యం ఇరు దేశాల మధ్య ఎక్కువ. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఇప్పుడు అమెరికా మీద ఎక్కువగా ఆధారపడ్డాయి. అమెరికా కిరాయి గూండా ఇజ్రాయిల్ కూడా…

మనకు సహాయం చెయ్యాలి అంటే అమెరికాతో సయోధ్యే ముఖ్యం. సరిహద్దున లేకపోయినా సరే అమెరికా మన ఆర్ధిక పరిస్థితిని ప్రభావం చేసే దేశం. రక్షణ రంగంలో మనకు ఆయుధాల కొరత ఉంది. చైనా మనకు సహాయం చేయడానికి ముందుకి వచ్చినా పాకిస్తాన్ ని పక్కలో పెట్టుకుని పడుకుంది కాబట్టి నమ్మలేము. అమెరికా సహాయం లేకపోతే పాకిస్తాన్ ఇంకా మన మీద ప్రతాపం చూపించి సరిహద్దుల్లో దాడులు పెంచే అవకాశం కూడా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version