క‌రోనా ఎఫెక్ట్‌ : ఇప్పుడే జ‌గ‌న్ స‌త్తా తెలిసేది…!

-

క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా మూడు రోజులుగా రాష్ట్రం మూగ‌బోయింది. ఆదివారం ఏదో జ‌న‌తా క‌ర్ఫ్యూ అంటూ కేవ‌లం 14 గంట‌లు స్వ‌చ్ఛందంగా పిలుపు ఇచ్చారు. అదేరోజు దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెర‌గ‌డంతో ఈ తీవ్ర‌త‌ను త‌ట్టుకునేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించాయి. రాష్ట్రంలో నిజానికి జ‌గ‌న్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఎవ‌రూ కొనియాడడం లేదు కానీ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ తీసుకోని విధంగా ముందుకు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు క్వారంటైన్ ల‌కు త‌ర‌లిస్తున్నారు.

దీనికితో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌లంటీర్ల‌ను పంపి ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు పూచీ ప‌డుతున్నారు. ఇంత వ‌ర‌కు చాలా బా గుంది. అయితే, రాష్ట్రంలో ఈ నెల 31 వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఎక్క‌డి వ్య‌వ‌స్థ అక్క‌డ స్తంభిం చి పో యింది. దీంతో ప్ర‌జ‌ల‌కు సోమవారం తొలి రోజే చుక్క‌లు క‌నిపించాయి. కూర‌గాయ‌ల ధ‌ర‌లు, నూనె ల ధ‌ర లు, పాల ధ‌ర‌లు కూడా పెరిగిపోయాయి. ఎక్క‌డి క‌క్క‌డ బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోయింది.

ప్ర‌భుత్వం ఒక ప క్క‌, లాక్ డౌన్ ప్ర‌క‌టించి ధ‌ర‌ల‌ను అదుపులోకి తీసుకురాక‌పోతే.. అంతిమంగా న‌ష్ట‌పోయిది మాత్రం ప్ర‌భుత్వ‌మే! ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నిత్యావ‌స‌ర ధ‌ర‌లు మండి పోతున్నాయి. మొత్తం పూర్తిగా ప్ర‌జార‌వాణాను నిలిపి వేయ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పోనీ.. కొన్ని విష‌యాల్లో అయినా ప్ర‌భుత్వం ప‌ట్టువిడుపుల ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించాల‌ని కోరుతున్నారు. కీల‌క‌మైన కూర‌గాయ‌లు, పాల విష యంలో ధ‌ర‌లు పెరిగితే.. ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశం ఉంటుంది.

అదేవిధంగా ప్ర‌జ‌ల‌కు స‌రైన మార్గ‌ద‌ర్శ‌నం కూడా చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. ఎక్క‌డ ఎక్క‌డ ఎలాంటి స‌దుపాయం క‌ల్పిస్తున్నార‌నే విష‌యంలో ప్ర‌భుత్వ ప‌రంగా మెరుగ్గానే సేవ‌లు ఉన్నా.. ప్ర‌జ‌ల‌కు మాత్రం తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మొత్తానికి క‌రోనా ఎఫెక్ట్ తో లాక్‌డౌన్ ప్ర‌క‌టించేస్తే.. స‌రికాదు ప‌ర్య‌వేక్షించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version