జగన్ కొట్టిన దెబ్బకి ప్రతీ ఒక్కడూ గప్ చుప్ !

-

కరోనా వైరస్ రాష్ట్రంలో ఎక్కువ విస్తరించకుండా, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థను బాగా ఉపయోగించుకుంటూ…వైరస్ ఎక్కువగా విదేశాలలో ఉన్న వారి నుండి వస్తున్న ఈ నేపథ్యంలో వారిని ఇంటికే పరిమితం చేసి 14 రోజులు బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.ఇంతలా కష్టపడుతున్నా తరుణంలో రాజకీయాలు చేయాలని చూస్తున్న చంద్రబాబుకి..జగన్ కొట్టిన తాజా దెబ్బకి టిడిపిలో ప్రతి ఒక్కడు గప్ చుప్ అయిపోయారు. ఇక పూర్తి విషయంలోకి వెళితే రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు హయాంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఈ విషయాన్ని జగన్ సర్కార్ కేంద్ర హోంశాఖ కి లెటర్ రాస్తూ సి.బి.ఐ విచారణ జరిపించాలని కోరడం జరిగింది. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయంపై దమ్ముంటే నిరూపించాలని, సాక్ష్యాలుంటే చూపించమని, చర్యలు తీసుకోమని సవాళ్ళు మీద సవాళ్ళు విసిరారు.

 

ఇటువంటి క్రమంలో జగన్ సర్కార్ రాసిన లెటర్ కి కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిబిఐ విచారణ  కి అనుమతులు ఇచ్చింది. దీంతో జగన్ దెబ్బకి ప్రస్తుతం టిడిపి నాయకుల నోట నుండి మాట రావటం లేదు. జగన్ వేసిన సీబీఐ బాణం దెబ్బకి ప్రతీ ఒక్కడూ గప్ చుప్ అయిపోయారు. అంతకుముందు సవాలు విసిరిన వాళ్ళు ఇప్పుడు అసలు మాట్లాడటం లేదు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version