అయోధ్య తీర్పుపై.. ఏపీ సీఎం జగన్ స్పందన..

-

దశాబ్దాల కాలం పాటు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెల్లడించింది. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. ‘అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన మీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది’ అని అన్నారు.

‘ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version