వైయస్ జగన్ కడప జిల్లా పర్యటన రద్దు… కారణమేమిటంటే..?

-

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన రద్దైంది. ఈనెల 21, 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు.అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.

కాగా.. ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. తొలుత జూన్ 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా జూన్ 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21, 22 తేదీల్లో రెండురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ 2 రోజుల సమావేశాల్లో ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు శాసనసభకు ఎక్కువసార్లు ఎన్నికైన, సుధీర్ఘ అనుభవం ఉన్న నేతను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version