BIG BREAKING : వైఎస్‌ షర్మిల అరెస్ట్‌

-

BIG BREAKING : తెలంగాణ వైసీపీ అధినేత వైఎస్‌ షర్మిల అరెస్ట్‌ అయ్యారు. ఆమెను మహబూబాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ వైసీపీ అధినేత వైఎస్‌ షర్మిల చేస్తున్న పాదయాత్ర అనుమతిని రద్దు చేశారు పోలీసులు.

ఈ మేరకు వైఎస్‌ షర్మిలను అరెస్ట్‌ చేశారు. కాగా, నిన్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ నాయక్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ షర్మిల. ఈ తరుణంలో పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం అందుతోంది.

కాగా, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఒక లంచగొండి. ఏఈ ఉద్యోగం పోగొట్టుకొని, ఎమ్మెల్యేగా మారి, భూములన్నీ కబ్జాలు పెడుతుండని నిన్న వైఎస్‌ షర్మిల ఫైర్ అయ్యారు. లిక్కర్ మాఫియా, గుట్కా మాఫియా, ఇసుక మాఫియా, బెల్లం మాఫియా.. ఆఖరికి పీడీఎస్ రైస్ మాఫియాకు పాల్పడుతూ వేల కోట్లకు పడగలెత్తిండు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు మాత్రం గాలికొదిలేశాడన్నారు షర్మిల. ఎంపీ మాలోత్ కవితకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ఆర్ గారు. అలాంటి మహిళ కనీసం కృతజ్ఞత లేకుండా వైయస్ఆర్ పై, వైయస్ఆర్ బిడ్డపై పిచ్చి ప్రేలాపనలు పేలుస్తోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version