ఎలక్టోరల్ బాండ్లతో అక్రమంగా సంపాదించుకోవాలని బీజేపీ చూస్తోందని వైఎస్ షర్మిల అన్నారు. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఈరోజు ఏపీ కాంగ్రెస్ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు.
ఎస్బీఐ ఎదుట వైఎస్ షర్మిలతో పాటు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, జేడీ శీలం, నరహరిశెట్టి, పల్లంరాజు నరసింహారావు నిరసన చేపట్టారు. ‘మోదీ కనుసన్నల్లో ఎస్బీఐ’ అని రాసిన ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… ఎస్బీఐ ప్రధాని మోడీ బ్యాంకా… ప్రజల బ్యాంకా అని ఆమె ప్రశ్నించారు. అన్ని ప్రాంతీయ పార్టీలు దమ్ముంటే వారి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటపెట్టాలని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.ఎలక్టోరల్ బాండ్లు ఏఏ కంపెనీలకు ఎంతెంత ఇచ్చాయో బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.ఏ కంపెనీ అయిన రాజకీయ పార్టీకి డబ్బు ఇస్తుందని.. కానీ వాడికి సంబంధించిన వివరాలను కేంద్రం గోప్యంగా ఉంచాలని చూడడం అక్రమమని ఆందోళన వ్యక్తం చేశారు. SBI వివరాలు బయటపెడితే మోడి, కేసీఆర్,జగన్, చంద్రబాబు పార్టీలే బయటకొస్తాయని ,కాంగ్రెస్ వివరాలు బయటకొచ్చినా తమకేం ఇబ్బంది లేదని ఆమె అన్నారు.