నల్గొండ : వైఎస్‌ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిలకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో పాదయాత్ర కు విరామం కలిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎవరూ కూడా సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని రూల్స్ పెట్టడంతో… వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది.
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ… పెన్షన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు,పలు రకాల ప్రజా సమస్యలు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపామమని… కోడ్ అయిపోయిన మరుసటిరోజే పాదయాత్ర స్టార్ట్ అవుతుందన్నారు. వరి కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పడం భావ్యమా ? అని ప్రశ్నించారు.
రైతుల కోసం ఎన్నో చేస్తే ఏడేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారని… రాష్ట్రంలో 91 శాతం మంది రైతులు అప్పుల పాలయ్యారని ఓ సర్వే చెప్పిందన్నారు. బహిరంగంగా మీడియా సమావేశాల్లోనే కేసీఆర్ నిజాలకంటే అబద్ధాలే ఎక్కువగా చెబుతున్నారని వెల్లడించారు. కేంద్రం పెత్తనం లేకుండా వరి కొనుగోలు చేస్తామని చెప్పిన కేసీఆర్ చేతకాకుంటే రాజీనామా చేసి దళితుడికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు షర్మిల.