ఎన్నికలు తర్వాత కేసీఆర్ గజిని అవడం ఖాయం ; వైఎస్ షర్మిల

-

ఎన్నికలు తర్వాత కేసీఆర్ గజిని అయిపోతారని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వెల్ లో కాసేపటి క్రితమే వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహారదీక్ష ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయాలని.. వారికి అన్ని విధాలుగా మా పార్టీ అండగా ఉంటుందన్నారు.

ఏడేళ్లుగా కేసీఆర్ గజ్వెల్ కి ఏమి చేశాడని… తాలిబన్ ల చేతి లో ఆప్ఘనిస్తాన్ ప్రజలు చిక్కుకున్నట్లు కల్వకుంట్ల కుటుంబము లో తెలంగాణ ప్రజలు చిక్కుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత దళితులు మీద 800 శాతం దాడులు పెరిగాయని.. 37 లక్షలు మంది రైతులు కి వాగ్దానం చేసి మూడు లక్షలు మందికి మాత్రమే రుణ మాపీ చేశారని మండిపడ్డారు. 54 లక్షలు మంది నిరుద్యోగులు జాబ్ లు కోసం ఎదురు చూస్తున్నారని.. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి అని తెలిపారు. నిరుద్యోగులువి ఆత్మహత్యలు కాదని… ప్రభుత్వ హత్యలని తెలిపారు. కేసీఆర్ ఛాతీ లో ఉన్నది గుండెనా? బండ నా?అని నిప్పులు చెరిగారు. నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ కారణంగా… అప్పుల తెలంగాణ… చావుల తెలంగాణ అయిపోయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version