విజయమ్మ ముఖ్య అతిధిగా షర్మిల సంకల్ప సభ..విజయమ్మ యాక్టివ్ పాలిటిక్స్???

-

ఖమ్మం జిల్లా వేదికగా షర్మిల పార్టీ ప్రకటనకు మార్గం సుగమమైంది. సభ జరుగుతుందా లేదా అన్న సందిగ్దతకు తెర దించుతూ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్‌లో కోవిడ్‌ నిబంధనలకు అనుగునంగా సభ నిర్వహించనున్నారు షర్మిల. ఇప్పటి వరకు ఆత్మీయ సమ్మేళనాలతో లోటస్ పాండ్‌లో షర్మిల పలు జిల్లాల నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధనే లక్ష్యంగా ఆమె పెట్టబోతున్న కొత్తపార్టీ పేరు, పార్టీ గుర్తు, జెండా, సిద్ధాంతాలను ఈ సభలోనే ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సభకు ముఖ్య అతిధిగా వైఎస్ విజయమ్మ పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది.


షర్మిల హైదరాబాద్ నుంచి రోడ్ షో గా ఖమ్మం సభకు బయలుదేరతారు. దారి పోడవునా ఆమెను ఘన స్వాగతం పలికేందుకు ఆమె సన్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడువునా 6 చోట్ల షర్మిల కు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో షర్మిలతోపాటు వైఎస్ విజయలక్ష్మి, పిన్ని భారతి పాల్గొనే అవకాశముంది. షర్మిల సభకు ఆమె అనుచరులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సంకల్ప సభకు తల్లి హోదాలో మాత్రమే వైఎస్ విజయలక్ష్మి హాజరవుతారని షర్మిల అనుచరులు చెబుతున్నారు.

షర్మిలకు జగన్ అన్యాయం చేశాడాని, వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పై జ‌గ‌న్ వ్యతిరేక‌త మీడియా హైలెట్ చేయడం..తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక‌ల ప్రచారంలో ప‌వ‌న్‌ ఇదే విష‌యాన్ని ప్రస్థావించడం జరిగింది. దీంతో ఈ విషయం పై వైఎస్ విజ‌యల‌క్ష్మి అనూహ్యంగా స్పందించారు. గత రెండురోజుల క్రితం వివేక హత్యకేసు పై విజయమ్మలేఖతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. విపక్షాలు అర్థం, పర్థం లేని ఆరోపణలు చేస్తుంటే వైఎస్ భార్యగా, సీఎం జగన్ తల్లిగా విజయమ్మ స్పందించి లేఖ రాశారని ఏపీలో వైసీపీ నేతలు చెబుతున్నారు.

షర్మిల,జగన్ కి నిజంగా దూరం పెరిగిందా. వైఎస్ వివేకా హత్య పై కుటుంబంలో తీవ్ర విభేదాలున్నాయన్న ప్రతిపక్ష పార్టీ నేతల ఆరోపణల నేపథ్యంలో ఖమ్మం వేదికగా జరుగుతున్న ఈ సభలో విజయమ్మ ఎలా స్పందిస్తారు అన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version