వైఎస్సార్ చేదోడు పథకం కింద 3వ విడత సాయాన్ని ప్రభుత్వం వచ్చే నెలలో అందించనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి కౌ10వేల చొప్పున అందించనుండగా.. లబ్ధిదారుల నుంచి EKYC చేయాలని గ్రామ/వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు లబ్ధిదారులు నిర్దేశిత వృత్తిపైనే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారా? పాక్షికంగా ఆధారపడి ఉన్నారా? వృత్తిపై ఆధారపడి లేరా? అనే వివరాలను సేకరిస్తోంది. గతేడాది కూడా అర్హులు ఎవరికైనా డబ్బులు రాకపోతే వారు గ్రామ సచివాలయానికి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే తనిఖీ ప్రక్రియ చేసి అర్హత ఉంటే డబ్బులు చెల్లిస్తారు. జగనన్న చేదోడు పథకంలో చేరాలని భావించే వారు సచివాలయం వెళ్లి సంప్రదిస్తే సరిపోతుంది. అవసరమైన డాక్యుమెంట్లును తీసుకెళ్లాలి. సచివాలయం సిబ్బంది స్కీమ్‌లో జాయిన్ అవ్వడానికి మీకు సహాయ పడతారు. ఇకపోతే గత ఏడాది స్కీమ్ కింద లబ్ధి పొందిన వారు ప్రస్తుత ఏడాది కూడా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు డబ్బులు వస్తాయి. లేదంటే మళ్లీ ఇబ్బందులు పడాల్సి రావొచ్చు.