తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ..పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. ఉత్తరాంధ్రలో కాస్త అటు ఇటు గా ఉన్న సీమలో మాత్రం వైసీపీ హవా ఉంటుందని, ఎన్నికలైన ఇక్కడ వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరు అనుకున్నారు. ఆఖరికి టిడిపి సైతం సీమ ఎమ్మెల్సీ స్థానాలపై పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లే కనిపిచలేదు. వైసీపీ అధికార బలం..ప్రలోభాలు, దొంగ ఓట్లు…ఇలాంటి పరిణామాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి.
దీంతో తూర్పు రాయలసీమ స్థానం అంటే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరులో టిడిపి గెలుపు ఆశ లేదు. కానీ ఎవరు ఊహించని విధంగా అక్కడ టిడిపి అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ భారీ మెజారిటీతో దూసుకెళుతున్నారు. మొదట ప్రాధాన్యత ఓటులోనే మెజారిటీ కొనసాగిస్తున్నారు. ఇక రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా కంచర్లకు లీడ్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓటులో పిడిఎఫ్ తో టిడిపికి అవగాహన ఉంది.
అటు పశ్చిమ రాయలసీమ అంటే కడప-కర్నూలు-అనంతపురం..స్థానం అబ్బో ఇక్కడ వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని అంచనా వేశారు. తీరా చూస్తే కేవలం 1971 ఓట్ల లీడ్ లోనే వైసీపీ ఉంది. ఇక్కడ కూడా టిడిపి గట్టి పోటీ ఇస్తుంది. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్క పెడితే ఫలితం తారుమారు అయ్యే ఛాన్స్ ఉంది.
ఎందుకంటే పిడిఎఫ్ తో అవగాహన వల్ల టిడిపికి రెండో ప్రాధాన్యత ఓట్లు బాగానే పడే ఛాన్స్ ఉంది. ఎన్నికల ముందు పిడిఎఫ్ వాళ్ళు మొదట ప్రాధాన్యత ఓట్లు పిడిఎఫ్ అభ్యర్ధి, రెండో ప్రాధాన్యత ఓట్లు టిడిపికి వేస్తామని అవగాహనకు వచ్చారు. సేమ్ టిడిపి రివర్స్ లో మొదట ఓటు టిడిపికి, రెండో ఓటు పిడిఎఫ్ కు..కాబట్టి పశ్చిమ సీమలో కూడా ఫలితం తేడా కొట్టవచ్చు. మొత్తానికి వైసీపీకి కంచుకోటల్లాంటి జిల్లాల్లో టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది.