ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీడీపీకి ఓటేసిన ఆ నలుగురు వైసీపీ నేతలెవరంటే..

-

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీకి అదనంగా పోలైన నాలుగు ఓట్లు ఎవరు వేశారన్నది ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇద్దరు ఎవరన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా.. మరో ఇద్దరు ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ ఇద్దరెవరనే విషయం తెలుసుకునేందుకు కసరత్తు చేసిన ప్రభుత్వానికి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు పోలైన బ్యాలట్‌ పత్రాలను పరిశీలించడంతో అసలు విషయం తెలిసిపోయినట్టుంది. 

ఆ నలుగురు ఎవరంటే

1) నెల్లూరు రూరల్‌ వైస్సార్సీపీ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

2) సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి) స్థానంలో వైస్సార్సీపీ

3) నెల్లూరు జిల్లాకు చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యేకి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం లేదని ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. అతను టీడీపీకి ఓటు వేసి ఉంటాడని పార్టీ వర్గాల అనుమానం.

4) రాజకీయంగా చైతన్యవంతమైన కోస్తా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా రానున్న ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వటం సాధ్యం కాదని అగ్రనేతలు కొద్దిరోజుల కిందట తేల్చిచెప్పారు. ఈ ఎమ్మెల్యేనూ వైస్సార్సీపీ అగ్రనేతలు సందేహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version