రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు, ఎప్పుడైనా జరగొచ్చు.. ఓడలు బళ్లవ్వొచ్చు.. బళ్లు ఓడలవ్వొచ్చు! వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. మూడోసారి కచ్చితంగా రీజనల్ పార్టీల అవసరం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే బలంగా ఉన్న రీజనల్ పార్టీలతో స్నేహాన్ని బలపరచుకునేపనిలో పడింది బీజేపీ.. అందులో భాగంగా ఏపీలో అత్యంత బలంగా ఉన్న జగన్ కు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తుంది!!
అవును… ప్రధాని మోదీ, అమిత్ షా లతో జగన్ భేటీలో ఈ పదవుల ఆఫర్ టాపిక్ వచ్చిందనేది మీడియా బలంగా చెబుతున్న విషయం! అందుతున్న సమాచారం ప్రకారం రెండు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి మోడీ సిద్ధంగా ఉండి.. ఆ ఆఫర్ ను జగన్ ముందు ఉంచారని తెలుస్తోంది! అయితే ఆ విషయంలో జగన్ సానుకూలంగా స్పందించలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది! ఈ క్రమంలో జగన్ కు మరో ఆఫర్ ఇచ్చిందంట బీజేపీ!
అందులో భాగంగా… ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి వైసీపీ ఆసక్తి చూపకపోయినా.. కనీసం ఖాళీగా ఉన్న లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని అంగీకరించాలని జగన్ ను మోడీ కోరినట్టు తెలుస్తోంది! ఇందుకు జగన్ కు అత్యంత సన్నిహితుడైన మిథున్ రెడ్డి పేరు కూడా మోడీనే సూచించారంట!! అయితే ఈ విషయాలన్నింటిపైనా ఊకట్టిన జగన్…. తమకు ఎటువంటి మంత్రి పదవులూ వద్దు.. ఏపీకి ప్రత్యేక హోదా మాత్రమే ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది!!
ఇక మిథున్ రెడ్డికి డిప్యుటీ స్పీకర్ పోస్ట్ గురించి.. పార్టీ నేతలందరితోనూ చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ఫోన్ లో తెలుపుతామని జగన్ బయలుదేరి వచ్చినట్లు తెలుస్తోంది!! అయితే ఈ విషయంలో జగన్ కాస్త సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం! మరి జగన్ చేసిన ఈ ప్రత్యేక హోదా డిమాండ్ కు మోడీ & కో సై అంటారా? లేక ఇంకా ఏపీకి హోదా అనే విషయంలో నాంచుడు ధోరణే కంటిన్యూ చేస్తారా అన్నది వేచి చూడాలి!