సెలక్ట్ కమిటీ ని లీగల్ గా చావుదెబ్బ కొట్టిన వైకాపా ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండు బిల్లులను శాసనమండలిలో చైర్మన్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి విచక్షణ అధికారంతో అడ్డుకోవటంతో తీవ్ర నిరాశ చెందిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నాడు అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. దీంతో శాసన మండలి రద్దు విషయం తెరపైకి రావడంతో వైసీపీ పార్టీకి చెందిన చాలా మంది నేతలు విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా శాసన మండలి లో ఉన్న పెద్దలు మేధావులు సలహాలు ఇవ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పడటం వల్ల మన రాష్ట్రానికి మరియు రాష్ట్రంలో జరిగే అభివృద్ధికి తీవ్ర నష్టం మనమే చేసిన వారం అవుతామని అసెంబ్లీలో ఉన్న వైసీపీ నేతలు శాసనమండలిని రద్దు చేయాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా అసెంబ్లీలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ  శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని, ఇలాగే సీఎం జగన్ ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. 51 శాతం ప్రజలు తమకు తీర్పునిచ్చారని, ప్రజలతో తిరస్కరించబడిన టీడీపీ అభివృద్ధిని అడ్డుకొంటోందని విమర్శించారు. అంతేకాకుండా గాంధీ మరియు అంబేద్కర్ లాంటి వాళ్లు పెద్దల సభ అనవసరమని అప్పట్లోనే చెప్పారని ధర్మాన ప్రసాదరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

దీంతో అసెంబ్లీలో వైసీపీ ఆల్మోస్ట్ ఆల్ శాసనమండలిని రద్దు చేయడం గ్యారెంటీ కావటంతో …లీగల్ గా కూడా సెలక్ట్ కమిటీ ని వైకాపా దెబ్బ కొట్టినట్లయింది అని అసెంబ్లీ ఆమోదించడంతో పాటు కేంద్రంలో కూడా జగన్ సర్కార్ కి అనుకూలంగానే శాసనమండలిని రద్దు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వైకాపా సెలెక్ట్ కమిటీ ని చావు దెబ్బ కొట్టినట్లయింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version