వైరల్ వీడియో; 140 మంది ఉన్న విమానం జనాల్లోకి వెళ్లిపోయింది…!

-

సోమవారం ఇరాన్ లో ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. 144 మందితో ప్రయాణిస్తున్న పాత ఇరానియన్ ప్యాసింజర్ విమానం రన్‌వేపైకి దూసుకెళ్లి అక్కడి నుంచి విమానాశ్రయం పక్కనే ఉన్న ప్రధాన రహదారిపైకి దూసుకువెళ్ళి భయపెట్టింది. ఇరాన్ లో చమురు సంపద ఎక్కువగా ఉన్న నైరుతి ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని మహషహర్‌లోని కాస్పియన్ ఎయిర్‌లైన్స్ కి చెందిన మెక్‌డోనెల్ డగ్లస్ ఎండి -83 హార్డ్ ఈ ప్రమాదానికి గురైంది.

ఈ పరిణామంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇరాన్ సివిల్ ఏవియేషన్ నెట్‌వర్క్ న్యూస్ దీనికి సంబంధించిన వీడియో ఒకటి విడుదల చేసింది. దీనితో విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ కాక్ పిట్ వద్దకు రావడంతో సిబ్బంది అరిచి ప్రయాణికులను వారి వారి స్థానాల్లో కూర్చోమని సూచించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి మహషర్‌కు ఈశాన్యంగా 610 కిలోమీటర్ల (380 మైళ్ళు) దూరంలో,

ప్రయాణిస్తున్న విమానంలో ప్రయాణికులందరినీ సురక్షితంగా తిరిగి విమానాశ్రయానికి తీసుకెళ్లారని ప్రావిన్షియల్ విమానాశ్రయ డైరెక్టర్ మహ్మద్ రెజా రెజానియన్ తెలిపారు. ఈ విమానంలో 136 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గురైన వెంటనే విమానం జనాలు లేని ప్రాంతం వద్దకు వెళ్లి ఆగిపోయినట్టు వీడియోలో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version