ఏపీలో ‘కమ్మ’గా టార్గెట్ చేసారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కమ్మ కులం టార్గెట్ అయిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం అనేది తీవ్ర దుమారం రేపుతుంది. తమను ఒక్క మాట కూడా అడగకుండా నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కేంద్ర అధికారుల సూచనతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేశామని ఎన్నికల కమీషనర్ చెప్తున్నారు.

అది అక్కడి వరకు ఆగి ఉంటే బాగానే ఉండేది గాని కమ్మ కులం టార్గెట్ అయింది. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ ని నియమించింది చంద్రబాబు నాయుడు కాదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన అధికారి రమేష్ కుమార్. జగన్ సిఎం అయినప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తి గోపాల కృష్ణ ద్వివేది. ఆయన తర్వాత వచ్చిన వ్యక్తి రమేష్ కుమార్. అయినా సరే జగన్… చంద్రబాబు నియమించారు అన్నారు.

సొంత సామాజిక వర్గం కాబట్టి ఆ పదవిలో కూర్చోబెట్టారు అని జగన్ అన్నారు. కాని ఎన్నికల సంఘం అధికారిని నియమించే అధికారం… రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండదు. అయినా సరే జగన్ సహా వైసీపీ నేతలు అదే ఆరోపణ పదే పదే చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేసారు అనడం ఇప్పుడు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకుని వెళ్ళే ప్రమాదం ఉంది. ఎన్నికల సంఘం అధికారి కేంద్రం ఆదేశాలు లేకుండా నిర్ణయం తీసుకోలేరు.

కాని జగన్ మాత్రం ఆ విషయం మరిచి కులాన్ని టార్గెట్ చేసారు. కులాలకు మతాలకు అతీతంగా ఉండాలని కులాల గురించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులే. అలాంటిది ఒక సామాజిక వర్గాన్ని ఈ విధంగా టార్గెట్ చేసి విమర్శలు చేయడం ఎంత వరకు భావ్యం అనేది ఆలోచించుకోవాలని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version