శ్రీవారి ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ

-

తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తుల విలువలను టీటీడీ ఆలయ మండలి సభ్యులు వెల్లడించారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు, వాటి విలువను టీటీడీకి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 960 ఆస్తులున్నాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మండలి సమావేశంలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ ఆస్తుల విలువ రూ. 85,700 కోట్లని ప్రకటించారు. ఆస్తుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి. రూ. 95 కోట్లతో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం , రూ. 30కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. శ్రీవారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవ సాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని నిర్ణయించామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

 

రూ. 2.45 కోట్లతో నందకం అతిథి గృహంలో ఫర్నిచర్‌,రూ. 3కోట్లతో నెల్లూరులో కల్యాణ మండపాల దగ్గర ఆలయం నిర్మాణం ఏర్పాటు చేస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. బ్రహ్మోత్సవాల అనంతరం టైమ్‌స్లాట్‌ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. ప్రాథమికంగా రోజుకు 20వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీజేస్తా మని పేర్కొన్నారు వైవీ సుబ్బారెడ్డి. రూ. 95 కోట్లతో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం , రూ. 30కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version