సింగర్ శ్రావణ భార్గవి పేరు ఈ మధ్య కాలంలో తెగ వినిపిస్తోంది. ఓకే ఒక్క వీడియోతో ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్ లో తెగ వినిపిస్తోంది. గత కొన్నిరోజులుగా ఒకపరి సంకీర్తన వీడియో పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్నమయ్య భక్తి పాటను అశ్లీలంగా చిత్రీకరించారంటూ భక్తులు శ్రావణ భార్గవి పై మండిపడ్డారు. అన్నమాచార్య కుటుంబ సభ్యుల అభ్యంతరం.. అన్నమయ్య అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు సింగర్ శ్రావణ భార్గవి. ఆ వీడియో నుంచి పాటను తొలగించి కేవలం మ్యూజిక్ తోనే ఆ వీడియోను యూట్యూబ్ లో ఉంచారు సింగర్ శ్రావణ భార్గవి. ఇదిలా ఉంటే సింగర్ శ్రావణ భార్గవి వివాదంపై సీరియస్‌గా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రియాక్టయ్యారు.
అన్నమాచార్యుల రచనలను కీర్తనలను ఎవరైనా అపహాస్యం చేస్తే మహాపాపం అవుతుందన్నారు వైవీ సుబ్బారెడ్డి. అన్నమయ్య సంకీర్తనలను దుర్వినియోగం చేసే చర్యలను టీటీడీ ఎంకరేజ్ చేయదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఒకవేళ అలాంటి పనులు ఎవరైనా చేస్తే చట్టపరంగా టీటీడీ యాక్షన్ తీసుకుంటుందని, అన్నమయ్య కీర్తనలకు రచనలకు తమ ప్రభుత్వం విశిష్ట ప్రాధాన్యత ఇస్తోందన్నారు వైవీ సుబ్బారెడ్డి. అందుకే అన్నమయ్య నడియాడిన ప్రాంతానికి ఆయన పేరు పెట్టామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.