Zombie Drug : అమెరికాలో జాంబీ డ్రగ్ కలకలం

-

అమెరికాలో ఓ కొత్త డ్రగ్‌ కలకలం సృష్టిస్తోంది. ‘జైలజీన్‌ అనే డ్రగ్‌ ఓవర్‌ డోసు కారణంగా ప్రజల శరీర చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా కనిపిస్తోందట. ‘ట్రాంక్‌’గా కూడా పిలిచే ఈ మందు.. ఇప్పుడు అమెరికాలోని మెజారిటీ నగరాల్లో ప్రజలపై తీవ్ర ప్రభావాలతో అలజడి సృష్టిస్తోంది. దేశంలోని చాలా నగరాల్లో ఈ మెడిసిన్‌ కనిపిస్తోందని టైమ్‌ మ్యాగజైన్‌ తెలిపింది.

ఈ వెటర్నరీ డ్రగ్‌ను తక్కువ ధరకే ఏకంగా వీధుల్లోనే అమ్మేస్తుండటం మరింత ఆందోళనకరమైన అంశమని తెలిపింది. ఈ డ్రగ్‌ దేశమంతటా వ్యాప్తి చెందితే ప్రజల ఆరోగ్యానికే ముప్పుగా మారే ప్రమాదం ఉన్నదని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

మొదటగా ఫిలడెల్ఫియా నగరంలో కనిపించిన ఈ డ్రగ్‌.. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజెల్స్‌ వంటి నగరాలకు కూడా పాకింది. జంతువులకు వినియోగించేందుకు ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) ఆమోదించిన ఈ జైలజీన్‌ మానవులకు సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రాంక్‌ డోప్‌ అనేది ఫెంటానిల్‌ మిశ్రమమని, ఇది అమెరికా యువత జీవితాలను నాశనం చేస్తోందని స్కై న్యూస్‌ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version