ఫిబ్రవరి 10 ఆదివారం రాశి ఫలాలు.. ఈ రాశివారు తెల్లని వ‌స్త్రాలు ధరించండి..!

-

సరస్వతీ దేవి, సూర్యుని అర్చిస్తే మంచి ఫలితం!


మేషరాశి- మంచి ఫలితాలు, దేవాలయ దర్శన సూచన, మనఃశాంతి, బాకీలు తీరుస్తారు. పరిహారాలు లక్ష్మీదేవిని పూజించండి.

వృష‌భ రాశి-  మిశ్రమ ఫలితం, కార్యనష్టం, ధననష్టం. పనులు నెమ్మదిగా సాగుతాయి. పరిహారాలు సూర్యుని ఆరాధించండి. అర్ఘ్యం ఇవ్వండి మంచి ఫలితాలు వస్తాయి.

మిధునరాశి- మిశ్రమ ఫలితాలు, ఊహించని ఘటనలు, భార్యతో పట్టింపులు. పరిహారాలు అమ్మవారికి తెల్లని పూలతో ఆర్చన, సూర్య ఆరాధన చేయండి.

కర్కాటకరాశి- మంచి రోజు, ఆకస్మిక ధనలాభం, చేసే పనిలో లాభం. పరిహారాలు ఇష్టదేవతారాధన, సూర్యారాధన.

సింహరాశి- మిశ్రమ ఫలితాలు, బాకీలు వసూలు, పనుల్లో జాప్యం, అనారోగ్యం. పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం, నమస్కారాలు, తెల్లని వస్త్ర ధారణ మంచి చేస్తుంది.

కన్యారాశి- అనుకూల ఫలితాలు, ప్రయత్న కార్యజయం, దేవాలయ దర్శన సూచన, విందులు, వినోదాలు. పరిహారాలు సూర్యుని ఆరాధించండి మంచి ఆరోగ్యం ఇస్తాడు.

తులారాశి- అనుకూల ఫలితాలు, పనుల్లో జయం, అన్నింటా విజయం, మనోదుఃఖం. పరిహారాలు తెల్లని పూలతో అమ్మవారికి పూజ.

వృశ్చిక రాశి-  ప్రతికూల ఫలితాలు, వ్యవహార నష్టం, దేవాలయ దర్శన సూచన, పనుల్లో జాప్యం. పరిహారాలు సూర్య ఆరాధన, అమ్మవారిని ఎర్రని/తెల్లని పూలతో పూజచేయండి.

ధనస్సురాశి- ప్రతికూల ఫలితాలు, పనుల్లో జాప్యం, ఇబ్బందులు, అనారోగ్యం. పరిహారాలు అమ్మవారికి పూజ, విష్ణువును మారేడుదళాలతో అర్చన మీకు మంచి చేస్తుంది.

మకరరాశి- అనుకూల ఫలితాలు, ఆరోగ్యం, ధనలాభం, చిన్నసమస్యలు అయినా దైవకఋపతో అధిగమిస్తారు. పరిహారాలు ఇష్టదేవతారాధన, సూర్యారాధన చేయండి.

కుంభరాశి- మిశ్రమ ఫలితాలు, అధిక కోపం, బంధువలకు అనారోగ్యం. పరిహారాలు అమ్మవారికి తెల్లని పూలతో అర్చన, సూర్య అరాధన చేయండి.

మీనరాశి-  అనుకూల ఫలితం, సోదర సహకారంతో పనులు పూర్తి, వ్యాపార లాభం. పరిహారాలు సూర్య ఆరాధన, చాలీసా పఠనం.

– ఫిబ్రవరి 10 ఆదివారం- మాఘమాసం- శ్రీపంచమి. అత్యంత విశేషమైన రోజు. కాబట్టి ఈ రోజు ఎవరైతే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానసంధ్యాలను ఆచరిస్తారో వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో ప్రతి ఆదివారం విశేషమైనది. అందుకే పొద్దున్నే సూర్యారాధన చేయండి. రాగి/శుభ్రమైన చెంబుతో శుద్ధ/మంచి జలాన్ని సూర్యునికి చూపించి దోసిట్లో చూపించి తులసిలోకి వదలండి. లేదా చెట్లలో పోయండి. అదేవిధంగా సూర్యనమస్కారాలు మీకు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇక శ్రీపంచమి అందరికీ జ్ఞానప్రదాత అయిన తల్లి అనుగ్రహం ఉంటే చాలు బుద్ది, వివేచనం కలిగి సరైన సమయంలో సరైన విధంగా స్పందించి కార్యజయం, సర్వకార్యవిజయం లభిస్తుంది. ఓం నమో మిత్రాయనమః, ఓం ఐం సరస్వత్యైనమః
-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version