దుర్గాదేవికి చండీదీపం పెట్టండి విశేష ఫలితం !
మేషరాశి: చిన్నచిన్న ఆటంకాలు, విందుభోజనం, వృత్తిరీత్యా నష్టం. పరిహారాలు శివాభిషేకం, మారేడుతో విష్ణు ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది.
వృషభరాశి: మిశ్రమరోజు. విందు, వినోదాలు, మిత్రులతో చర్చలు,మానసిక ఆందోళన. పరిహారాలు ఆంజనేయస్వామి దేవాయల దర్శన లేదా హనుమాన్‌చాలీసా పఠనం/శ్రవణం.
మిధునరాశి: ప్రతికూలమైన రోజు, ఆర్థికంగా ఇబ్బందులు, అనవసర దూషణలు, ధననష్టం. పరిహారాలు దుర్గాదేవికి చండీదీపారాధన చేయండి. ఇంట్లో అయితే తులసి వద్ద లేకుంటే దగ్గర్లోని ఏదైనా దేవాలయంలో చేయండి.
కర్కాటకరాశి: అనుకూలమైనరోజు, పనుల్లో జయం, కళత్ర లాభం. ఇష్టదేవతారాధన చేయండి.
సింహరాశి: కార్యలాభం, అకాల భోజనం, వాహన లాభం, చిన్నచిన్న సమస్యలు. పరిహారాలు ఈశ్వర/విష్ణు ఆరాధన చేయండి.
కన్యారాశి: ప్రతికూలం. సోదర వర్గంతో వివాదాలు, శారీరక అలసట, శ్రమ అధికం. పరిహారాలు దుర్గా/అమ్మవారి దేవాలయాన్ని దర్శించి ప్రదక్షణలు చేయండి. వీలైతే చండీదీపారాధన చేయండి.
తులారాశి: ఆదాయానికి మించి ఖర్చులు, దురవార్తా శ్రవణం, వివాదాలు. మంచి ఫలితాల కోసం నవగ్రహ ప్రదక్షణలు, గోసేవ చేయండి.
వృశ్చికరాశి: లాభం, కార్య సఫలీకృతం, స్నేహలాభం, విందులు, వినోదాలు. పరిహారాలు దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
ధనస్సురాశి: కార్య జయం, పనుల్లో అనుకూలం, విందులు, వాహన లాభం. పరిహారాలు ఇష్టదేవతరాధన.
మకరరాశి: ప్రతికూలం. అశుభ మూలక వ్యయం, మిత్రులతో చర్చలు. పరిహారాలు శనికి ప్రదక్షణలు చేయండి. నల్ల ఆవు లేదా మేకకు అరటిపండు తినిపించండి.
కుంభరాశి: ప్రతికూలం. అపజయాలు, సమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. నిరంతరం దేవనామస్మరణ చేసుకోండి. వీలైతే దేవాలయ దర్శనం ప్రదక్షణలు చేయండి.
మీనరాశి: అధిక ఉత్సాహం, బంధువుల రాక, ధనవ్యయం, వ్యవహార జయం. మంచి ఫలితాల కోసం తులసీ దళాలతో విష్ణు ఆరాధన, సింధూర ధారణ, వేంకటేశ్వర ఆరాధన చేయండి.
-కేశవ