Real Estate : హైదరాబాద్లో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే 10 రెట్ల లాభం పక్కా!

-

Real Estate : హైదరాబాద్ నగరంలో బెంగళూరు హైవేకి దగ్గర ఏరియాల్లో పెట్టుబడులు పెడితే కచ్చితంగా భారీ లాభాలని సొంతం చేసుకోవచ్చు. బెంగుళూరు హైవేకి మామూలు డిమాండ్ లేదనే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ లో ఆ హైవే నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాలు మూడు ఉన్నాయి. కనుక అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు పొందవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణుల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇక శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది బెంగళూరు హైవే.

Real Estate

అలాగే మహబూబ్ నగర్ దాకా ఎంఎంటీఎస్ ట్రాక్ కూడా పూర్తయ్యింది. అంతకు ముందు ఫలక్ నామా దాకే ఎంఎంటీఎస్ రైళ్లు నడిచేవి. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఉన్న ఉందానగర్ దాకా రైళ్లు నడుస్తున్నాయి. శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ దాకా మెట్రో రైలు ప్లాన్ కూడా ఉంది. హైదరాబాద్ నుంచి శంషాబాద్ కి కూడా మెట్రో రైలు ప్లాన్ ఉంది. మెట్రో రైలు వస్తే హైదరాబాద్ లో పని చేసే ఉద్యోగులకు డైరెక్ట్ కనెక్టివిటీ కచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెడితే భారీ లాభాలు సొంతం చేసుకోవడం ఖాయం.

షాద్ నగర్ లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎయిర్ టెల్ డేటా సెంటర్లు, యూనివర్సిటీలు, అంతర్జాతీయ పాఠశాలలు, అంతర్జాతీయ హాస్పిటల్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా చాలా కంపెనీలు, పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. భవిష్యత్తులో ఎన్నో లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కచ్చితంగా ఉంటాయి.పెట్టుబడిదారులకు మంచి వార్త ఏంటంటే షాద్ నగర్ ఏరియాలో స్థలాలు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. రాబోయే పది సంవత్సరాల కాలంలో ఈ ఏరియాలో కంపెనీలు, పరిశ్రమలు పూర్తవుతాయి.. అప్పుడు కచ్చితంగా అందులో పని చేసే ఉద్యోగులు ఇక్కడ స్థిరపడతారు.

ఇక్కడ నివాస స్థలాలకు, ఇండ్లకు డిమాండ్ భారీగా పెరుగుతుందని సమాచారం తెలుస్తుంది. అప్పుడు స్థలాల ధరలు కూడా ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు పెరుగుతాయని తెలుస్తుంది. ఇప్పుడు షాద్ నగర్ లో చదరపు అడుగు స్థలం రూ. 2000 దాకా ఉంది. ఆ లెక్కన గజం 17 వేలు పైనే పడుతుంది. ఈ మూమెంట్ లో 10 లక్షలు పెట్టుబడి పెట్టి స్థలం కొంటే దాని విలువ పదేళ్ల తర్వాత ఏకంగా కోటి రూపాయల పైనే అవుతుందని చెప్పవచ్చు. పదేళ్లలో 10 రెట్లు పెరుగుతుంది. అలాగే హైదరాబాద్లోని మరో ఏరియా అయిన దుండిగల్లో పెట్టుబడులు పెట్టినా కూడా భవిష్యత్తులో కోట్ల లాభాలు సొంతం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version