భూమికి నష్టం తప్పదా…? సూర్యుడి నుంచి భారీ సౌర తుఫాన్ భూమిని ఈరోజు తాకే అవకాశం

-

భూమికి నష్టం తప్పదా… విశ్వానికి వెలుగు పంచే సూర్యుడే భూమిని దెబ్బతీయబోతున్నాడా… అంటే ఔననే సమాధానం వస్తుంది. ఇప్పుడు కాకుండా ఏదో రోజు భూమిని సూర్యుడే కబలిస్తాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా ఈరోజు భూమికి ముప్పు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సూర్యుడి నుంచి ఏర్పడిన అత్యంత తీవ్రమైన సౌర తుఫాన్ భూమి వైపుగా దూసుకువస్తోందని US స్పేస్ ఏజెన్సీ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) మరియు నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) వెల్లడించాయి. ఈ పరిణామం భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. 

జీ-2 క్లాస్ గా వర్గీకరించిన ఈ సౌర తుఫాన్ ఈరోజు భూమిని తాకనుంది. సెకనుకు 429-575 కిమీ/సె+ మధ్య వేగంతో ఈ సౌర తుఫాన్ భూమి వైపు వస్తోంది. సూర్యుడిపై AR2987 పిలువబడే సన్ స్పాట్ నుంచి భారీ పేలుడుతో ఒక్కసారిగా సూర్యుడి నుంచి భారీ శక్తి వెలువడి బయటకు వచ్చింది. దీంతో ఈ సౌర తుఫాన్ ఏర్పడింది. ఈ పరిణామం భూమిపై ప్రతికూల ప్రభావం చూపించనుంది. కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలతో పాటు… విద్యుత్ గ్రిడ్ లను దెబ్బతీయవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సౌర తుఫాన్ లో ఉండే అత్యంత ఆవేశపూరిత కణాలు ప్లాస్మా రూపంలో శాటిలైట్లను, విద్యుత్ గ్రిడ్ లను కప్పకూల్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version