ఎయిర్‌టెల్ బ్లాక్ సేవ‌ల‌ను ప్రారంభించిన ఎయిర్ టెల్‌.. ఇక అన్నింటికీ ఒకే ప్లాన్‌..

-

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ కొత్త‌గా ఎయిర్‌టెల్ బ్లాక్ Airtel block సేవ‌ల‌ను ప్రారంభించింది. పోస్ట్‌పెయిడ్ మొబైల్‌, డీటీహెచ్‌, ఫైబ‌ర్ సేవ‌ల‌ను వాడుతున్న వారు అన్నింటికీ క‌లిపి ఒకే బ్లాక్ ప్లాన్‌ను తీసుకోవ‌చ్చు. దీంతో క‌స్ట‌మ‌ర్ల‌కు ప‌లు బెనిఫిట్స్‌ను అందిస్తారు. ఈ క్ర‌మంలో ఎయిర్‌టెల్ ప‌లు కొత్త బ్లాక్ ప్లాన్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

ఎయిర్‌టెల్ బ్లాక్/ Airtel block

ఎయిర్‌టెల్ బ్లాక్ సేవ‌ల కింద క‌స్ట‌మ‌ర్ల‌కు నాలుగు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

* రూ.998 బ్లాక్ ప్లాన్‌లో 2 మొబైల్ క‌నెక్ష‌న్లు, 1 డీటీహెచ్ క‌నెక్ష‌న్ పొంద‌వ‌చ్చు. ఈ మూడింటికీ ఒకే బిల్ వ‌స్తుంది.

* రూ.1349 ప్లాన్‌లో 3 మొబైల్ క‌నెక్ష‌న్ల‌ను, 1 డీటీహెచ్ క‌నెక్ష‌న్‌ను పొంద‌వ‌చ్చు. వీటన్నింటికీ కూడా ఒకే బిల్‌ను ఇస్తారు.

* రూ.1598లో 2 మొబైల్ క‌నెక్ష‌న్లు, 1 ఫైబ‌ర్ క‌నెక్ష‌న్‌ను పొంద‌వ‌చ్చు.

* రూ.2099లో 3 మొబైల్ క‌నెక్ష‌న్లు, 1 ఫైబ‌ర్ క‌నెక్ష‌న్, 1 డీటీహెచ్ క‌నెక్ష‌న్ పొంద‌వ‌చ్చు.

ఈ ప్లాన్ల‌లో దేన్ని తీసుకున్నా అందులో ఉప‌యోగించుకునే క‌నెక్ష‌న్ల‌ను బ‌ట్టి అన్నింటికీ క‌లిపి ఒకే బిల్లు వ‌స్తుంది. అయితే ఇవే కాదు, క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన విధంగా బ్లాక్ ప్లాన్‌ను క్రియేట్ చేసుకోవ‌చ్చు. గ‌రిష్టంగా 10 పోస్ట్ పెయిడ్ క‌నెక్ష‌న్లు, 2 ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబ‌ర్ క‌నెక్ష‌న్లు, 2 ఎయిర్ టెల్ డీటీహెచ్ ప్రైమరీ క‌నెక్ష‌న్ల‌కు ఒకే బిల్లు పొంద‌వ‌చ్చు.

ఈ ప్లాన్ల‌ను తీసుకునే కొత్త, పాత క‌స్ట‌మ‌ర్ల‌కు మొద‌టి 30 రోజులు రెంట‌ల్ ఫ్రీ ఉంటుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ను ఉచితంగా ఇస్తారు. డీటీహెచ్ స‌ర్వీస్ ఉంటే హెచ్‌డీ బాక్స్ ను ఫ్రీగా ఇస్తారు. ఇన్‌స్టాలేష‌న్ చార్జిలు లేవు. ఇక ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ల‌ను పొందేందుకు క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు స‌మీపంలోని ఎయిర్‌టెల్ స్టోర్‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు. లేదా ఎయిర్ టెల్ వెబ్‌సైట్‌లో రిక్వెస్ట్ పెట్టుకోవ‌చ్చు. అలాగే 8826655555 అనే నంబ‌ర్‌కు కూడా కాల్ చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version