ఈ ఫొటో ఎడిటింగ్ యాప్ వాడుతున్నారా ? వెంట‌నే పాస్‌వ‌ర్డ్‌ల‌ను మార్చేయండి..!

-

ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో యూజ‌ర్ల డేటాకు భ‌ద్ర‌త అనేది లేకుండా పోయింది. ఎక్క‌డ చూసినా హ్యాక‌ర్లు యూజ‌ర్ల డేటాను చోరీ చేస్తున్నారు. ఇక తాజాగా మ‌రొక యాప్‌కు చెందిన యూజ‌ర్ల డేటా పెద్ద ఎత్తున చోరీకి గురైంది. దాన్ని ఓ హ్యాక‌ర్ ఇంటర్నెట్‌లో రిలీజ్ చేశాడు.

పిక్స‌ల్ఆర్ (Pixlr) అనే ఫొటో ఎడిటింగ్ యాప్‌కు చెందిన మొత్తం 1.9 మిలియ‌న్ల యూజ‌ర్ల డేటాను షైనీ హంట‌ర్స్ అనే హ్యాక‌ర్ దొంగిలించాడు. దాన్ని ఇంట‌ర్నెట్‌లో లీక్ చేశాడు. ఆ యాప్‌లోని యూజ‌ర్ల ఈ-మెయిల్ ఐడీలు, లాగిన్ నేమ్స్‌, పాస్‌వ‌ర్డ్‌లు, లీక‌య్యాయి. మొత్తం డేటాను సేక‌రించిన ఆ హ్యాక‌ర్ దాన్ని మ‌ళ్లీ నెట్‌లో లీక్ చేయ‌డం గ‌మ‌నార్హం.

పిక్స‌ల్ఆర్ యాప్ వాడుతున్న యూజ‌ర్ల డేటా హ్యాకింగ్‌కు గురైనందున యూజ‌ర్లు వెంట‌నే త‌మ త‌మ పాస్‌వ‌ర్డ్‌ల‌ను మార్చుకోవాల‌ని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. కాగా ఈ యాప్‌కు గాను 2020 చివ‌ర్లో డేటాను హ్యాక‌ర్లు చోరీ చేసి ఉంటార‌ని తెలుస్తోంది. అయితే దీంతో హ్యాక‌ర్లు ఏమైనా ప్ర‌యోజనం పొందారా, లేదంటే ఊరికే ఆ ప‌నిచేశారా.. అన్న వివ‌రాలు తెలియ‌లేదు. కానీ గ‌తంలోనూ ప‌లు కంపెనీల‌కు చెందిన వెబ్‌సైట్ల‌ను కూడా ఈ హ్యాక‌ర్లు హ్యాక్ చేసిన‌ట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version