షాక్: 29 రోజుల్లో భారత్ లో మరణ శిక్ష విధింపు, సంచలన తీర్పు

-

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌ లో పసిబిడ్డపై అత్యాచారం, హత్య జరిగిన నెల రోజుల తరువాత, ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం నిందితులకు మరణశిక్ష విధించింది. రికార్డు సమయంలో ఈ శిక్షను విధిస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 19 న, ఘజియాబాద్‌ లోని కవి నగర్ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న పొదల్లో 2.5 సంవత్సరాల వయసున్న మైనర్ బాలిక కనిపించింది. విచారణ ప్రారంభమైన తరువాత, మరణశిక్ష విధించడానికి కోర్టు 29 రోజులు పట్టింది.

rape

బాలిక తండ్రికి సన్నిహితుడైన చందన్‌కు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి మహేంద్ర శ్రీవాస్తవ మరణశిక్ష విధించారు. తీర్పు ఇవ్వడానికి ముందు పది మంది సాక్షులను కోర్టుకు హాజరుపరిచారు. రికార్డ్ టైం లో తీర్పు ఇచ్చామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉత్కర్ష్ వాట్స్ అన్నారు. నేరం జరిగిన వెంటనే నిందితుడిని అరెస్టు చేశామని, డిసెంబర్ 29 న చార్జిషీట్ దాఖలు చేసినట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ తెలిపారు.

అక్టోబర్ 19 న బాధితురాలి కుటుంబం కవి నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని, ఆమె కుమార్తె తప్పిపోయిందని ఫిర్యాదులో పేర్కొంది. కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేయడంతో… పోలీసులు బాధితురాలి తండ్రికి సన్నిహితుడైన చందన్ పాండేను విచారించి అదే రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతను అమ్మాయి గురించి తనకు తెలియదని చెప్పి పోలీసులను తప్పుదారి పట్టించాడని బాధితురాలి తల్లి తెలిపింది. బాలిక తప్పిపోయిన రెండవ రోజు మధ్యాహ్నం, కవి నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కాలువ ప్రక్కన ఉన్న పొదల్లో ఆమె మృతదేహం కనిపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version