యాంటీ అబ్యూజ్‌ ఫీచర్లను ప్రవేశపెట్టిన ఇన్‌స్టాగ్రామ్.. వేధించే వారికి ఇక చెక్‌..!

-

సోషల్‌ మీడియా యాప్‌లలో చాలా మంది యూజర్లకు వేధింపులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా మహిళలు, సెలబ్రిటీలు వేధింపులకు గురవుతుంటారు. అయితే అలాంటి వారిని ఎదుర్కొనేందుకు సోషల్ యాప్స్ ఇప్పటికే అనేక రకాల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ( Instagram ) కూడా మరిన్ని ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌ | Instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో పలు కొత్త ఫీచర్లను తాజాగా ప్రవేశపెట్టారు. ఆ యాప్ లో ఎక్కువగా వేధింపులకు గురయ్యే వారికి ఈ ఫీచర్లు బాగా పనిచేస్తాయి. యూజర్లు తమ పోస్టులకు కామెంట్లు, డైరెక్ట్‌ మెసేజ్‌ల పరిమితి విధించవచ్చు. అంటే పరిమితి దాటితే యూజర్లు కామెంట్లు చేయలేరు. డైరెక్ట్‌ మెసేజ్‌లు పెట్టలేరు. అనుచిత, అసభ్య పదజాలం వాడే వారికి గట్టి హెచ్చరికలు జారీ చేస్తారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లకు కొత్తగా లిమిట్స్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని సహాయంతో తమను ఫాలో కాని యూజర్లతోపాటు కొత్తగా ఫాలో అవుతున్న యూజర్లకు చెందిన కామెంట్లను ఆటోమేటిగ్గా హైడ్‌ చేయవచ్చు. డైరెక్ట్‌ మెసేజ్‌ రిక్వెస్ట్‌లను కూడా హైడ్‌ చేయవచ్చు. ఈ ఫీచర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లందరికీ లభిస్తోంది. అందుకుగాను యాప్‌లో ప్రైవసీ సెట్టింగ్స్ అనే సెక్షన్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

ఇక ఈ యాప్ లో ఇప్పటికే హిడెన్‌ వర్డ్స్‌ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో అనుచిత, అసభ్య కామెంట్లను ఆటోమేటిగ్గా ఫిల్టర్‌ చేయవచ్చు. అవి ఒక హిడెన్ ఫోల్డర్‌లోకి వెళ్తాయి. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది. కేవలం కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంది. కానీ పైన తెలిపిన ఫీచర్లను మాత్రం తాజాగా అందుబాటులోకి తెచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version