ఎల్‌జీ నుంచి మరో టీవీ లాంచ్..ధర ఎంతో తెలుసా?

-

ఎలెక్ట్రానిక్ ప్రముఖ దిగ్గజ కంపెనీ ఎల్‌జీ ఇప్పటికే ఎన్నో ఎలెక్ట్రిక్ వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేసింది.ప్రస్తుతం ఇండియాలో భారత్ లో సరికొత్త టీవీలను విడుదల చేసింది. OLED సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌జీ అభివృద్ధి చేసిన ఈ టీవీలు ఎంతో నాణ్యత కలిగి ఉండి,ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకుంటాయని సంస్థ తెలిపింది.ఎల్‌జీ ఇండియా ఈ టీవీ లను మూడు రోజుల క్రితం మార్కెట్ లోకి విడుదల చేసింది.ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది LG Signature R OLED టీవీ గురించే..సిగ్నేచర్ R OLED TV, ఇది రోల్ చేయదగిన టీవీ.. OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.

అయితే, మనకు స్క్రీన్ అవసరం లేదు అనుకున్నప్పుడు లేదా టెలివిజన్ దగ్గర లేనప్పుడు కిందనే ఉండే సౌండ్ సిస్టమ్‌లోకి టీవీ మొత్తాన్ని చుట్టేయవచ్చు..ఎంతో నైపుణ్యంతో , సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టీవీని రూపొందించారు.ఈ విధానం అందరికి నచ్చింధి..దీని ఫీచర్ చూసిన జనాలు థ్రిల్ అవుతున్నారు. చూడటానికి బహు ముచ్చటగా ఉందని జనాలు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉందని ఆ సంస్థ ప్రతినిది తెలిపారు.

ఇప్పటివరకు ఏ టీవీకి లేని ఫెసిలిటీస్ ఈ టీవీకి ఉండటం విశేషం..దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి అద్భుతమైన సాంకేతికతను తమ ప్రీమియం కస్టమర్ల కోసం తీసుకొచ్చినట్లు ఎల్‌జీ సంస్థ తెలిపింది. 97 అంగుళాల ఈ చుట్ట టీవీ ధర రూ. 75 లక్షలుగా నిర్ణయించింది ఎల్‌జీ సంస్థ. దీనితో పాటుగా..ఇదే తరహా OLED సాంకేతికత వినియోగించి మరికొన్ని ప్రీమియం టీవీలను కూడా భారత వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఎక్కువ ధర వెచ్చించి ‘చుట్ట’ టీవీ కొనుగోలు చేయలేని వినియోగదారులు..తక్కువ ధరలో అదే అనుభూతి పొందేలా G2, Z2, C2 సిరీస్ ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.42-అంగుళాల నుండి 97-అంగుళాల వరకు పరిమాణాలలో ఈ OLED TVలు అందుబాటులో ఉండనున్నాయి.దీని ధర 75 వేలకు పైగా ఉంటుంది. కేవలం సాంకేతిక పరంగానే కాదు ఫీచర్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. ఫ్యుచర్ లో మరింత టెక్నాలజీని ఉపయోగించి కొత్త ప్రోడక్ట్ లను మార్కెట్ లోకి తీసుకొని వస్తామని సంస్థ పేర్కొంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version