గేమింగ్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్… జులై 5 Asus ROG phone 6 లాంచ్‌

-

అసుస్‌ నుంచి అసుస్‌ రోగ్‌ ఫోన్‌ 6 స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌కు రెడీ అయింది. ఇది ఇండియాలో జులై 5న లాంచ్‌ కానుంది. ఇది ఒక గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌. అయితే ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఇప్పటికీ ఎలాంటి వివరాలు తెలపలేదు. వర్చువల్‌ ఈవెంట్‌ ద్వారా కంపెనీ ఫోన్‌ విడుదల చేయనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ సేల్‌కు రానుంది. దీంతోపాటు ఈ ఫోన్ రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.ఈ ఈవెంట్‌ను కంపెనీ యూట్యూబ్ చానెల్లో లైవ్ చూడవచ్చు. దీని ధర వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు.
టిప్‌స్టర్‌ ప్రకారం.. ఈ ఫోన్ బ్లాక్, వైట్ రంగుల్లో లాంచ్ కానుంది. రోగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లన్నీ దాదాపు ఈ కలర్ ఆప్షన్‌లోనే లాంచ్ అవుతాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటితో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించనున్నారు. అసుస్ లోగో, టెన్‌సెంట్ బ్రాండింగ్ కూడా ఫోన్ వెనకవైపు చూడవచ్చు. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లను ఫోన్ ఎడమవైపు చూడవచ్చు.
ఈ ఫోన్‌తో పాటు రోగ్ ఫోన్ 6 ప్రో కూడా లాంచ్ కానుందని సమాచారం.
అసుస్ రోగ్ ఫోన్ 6లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.
18 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్, ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాలు అందించనున్నట్లు తెలుస్తోంది.
జులై 5 తేదీన సాయంత్రం 5:20 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీని కంటే ముందు జులై నాలుగున మార్కెట్‌లోకి ప్రముఖ బ్రాండ్‌ ఫోన్లు.తక్కువ బడ్జెట్‌లోనే విడుదల కానున్నాయి. మరి ఆ ఫోన్లకు Asus ROG 6 పోటీ ఇస్తుందో చూడాలి. ఫీచర్స్‌ తెలిస్తే ఫోన్‌ పరిస్థితి ఏంటో ఈజీగా చెప్పేయొచ్చు. లాంచ్‌ వరకు ఫోన్‌కు సంబంధించి సమాచారం లీక్‌ అవకపోవడం గమనార్హం.!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version