కొత్త ఫోన్ల పేర్లు, గెలాక్సీ ఎస్‌20, గెలాక్సీ బ్లూమ్‌ – ధృవీకరించిన సామ్‌సంగ్‌ ?

-

ఫిబ్రవరిలో ఆనవాయితీగా ప్రవేశపెట్టాల్సిన ఎస్‌ సిరీస్‌ ఫోన్లను ఎస్‌ 11 బదులుగా ఎస్‌20గా వ్యవహిరించనుంది. అలాగే నిలువుగా మడతపెట్టగలిగే ఫోన్‌ను గెలాక్సీ బ్లూమ్‌గా పిలవనుంది. వాటి చిత్రాలు కూడా లీకయ్యాయి.

సాధారణంగా సామ్‌సంగ్‌ తన ఉత్పత్తులను సీఈఎస్‌ లాంటి బహిరంగ ఈవెంట్లలో ప్రవేశపెట్టదు. కానీ ఈ మధ్యకాలంలో వరుసగా మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌కు ముందు ఒక స్వంత ఈవెంట్‌ జరపడం మొదలుపెట్టింది. ఈ ఏడాది కూడాఫిబ్రవరి 11న ఒక లాంచింగ్‌ ఈవెంట్‌ ఉన్నట్లు ప్రెస్‌కు ఆహ్వానం పంపింది. ఎలాగూ మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానుంది కనుక, ఇది కొత్త గెలాక్సీ ఎస్‌ సీరీస్‌ ఫోన్ల కోసమే అనేది మొబైల్ అభిమానులందరికీ అర్థమయిపోయింది.

అయితే, పోయిన వారం, రహస్యంగా జరిగిన ఒక ప్రైవేట్‌ మీటింగ్‌లో సామ్‌సంగ్‌ సీఈఓ, కొత్త ఫోన్ల పేర్లను అధికారికంగా ధృవీకరించినట్లు తెలిసింది. అంతే కాక వాటి ఫోటోలను కూడా అతిథులకు ప్రదర్శించినట్లు సమాచారం.

కొత్త ఎస్‌ సీరీస్‌ ఫోన్లను మామూలుగా రావాల్సిన 11 కాకుండా 20గా నామకరణం చేసినట్లు సామ్‌సంగ్‌ అతథులకు తెలిపింది. వాటిని మూడు రకాలుగా, ఎస్‌20, ఎస్‌20+, ఇంకా ఎస్‌ 20 అల్ట్రాగా ప్రవేశపెట్టనుంది. ఇందులో అల్ట్రా మోడల్‌, అదిరిపోయే హై ఎండ్‌ ఫీచర్లతో ఉండనున్నట్లు భోగట్టా. అవేంటన్నవి పూర్తిగా తెలియలేదు.

ఇకపోతే, గెలాక్సీ ఫోల్డ్‌2 గా వ్యవహరించబడుతున్న మడతపెట్టే ఫోన్‌, ఈసారి విప్లవాత్మకంగా నిలువుగా తయారుచేసింది. గెలాక్సీ ఫోల్డ్‌, పుస్తకంలా అడ్డంగా తెరుచుకునేదని ఇప్పటికే తెలుసు. ఈ కొత్త ఫోన్‌ను ఫోల్డ్‌2 కాకుండా ‘గెలాక్సీ బ్లూమ్‌’గా పిలువనున్నట్లు ఆ సమావేశంలో ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో ప్రఖ్యాత మోటొరోలా తమ కొత్త ఫోన్‌ను పాత ‘రేజర్‌’లా నిలువుగా మడతపెట్టేట్టు తయారుచేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దాన్ని ‘రేజర్‌ 2019’గా పిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version