అద్భుతం.. ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు..!

-

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో.. భార‌త్‌లో ఫైండ్ ఎక్స్‌2, ఎక్స్‌2 ప్రొ పేరిట రెండు నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. వీటిలో 6.7 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ డిస్‌ప్లే 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంటుంది. ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ పంచ్ హోల్ కెమెరాను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 865 అధునాత‌న ప్రాసెస‌ర్‌ను వీటిలో అమ‌ర్చారు. ఈ ఫోన్ల‌లో 5జి స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. గేమ్స్ ఆడేట‌ప్పుడు, వీడియోలు చూసేట‌ప్పుడు, ఇంట‌ర్నెట్ బ్రౌజ్ చేసేట‌ప్పుడు ఫోన్ ఎక్కువ‌గా హీట్ అవ‌కుండా ఉండేందుకు గాను వీటిలో ప్ర‌త్యేకంగా లిక్విడ్ కూలింగ్ టెక్నాల‌జీని ఏర్పాటు చేశారు.

ఈ ఫోన్ల‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. ఫైండ్ ఎక్స్‌2 వెనుక భాగంలో ఆ 48 మెగాపిక్స‌ల్ కెమెరాకు తోడు 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ టెలిఫొటో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. అదే ఫైండ్ ఎక్స్‌2 ప్రొలో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ కెమెరాతోపాటు మ‌రో 48 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్ టెలిఫొటో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఇక ఫైండ్ ఎక్స్‌2 ఫోన్ కెమెరాల‌తో 5ఎక్స్ హైబ్రిడ్ జూమ్‌, 20 ఎక్స్ డిజిట‌ల్ జూమ్ ల‌భిస్తుంది. అదే ఫైండ్ ఎక్స్‌2 ప్రొ ఫోన్ కెమెరాల‌తో అయితే 10ఎక్స్ హైబ్రిడ్ జూమ్‌, 60ఎక్స్ డిజిట‌ల్ జూమ్ ల‌భిస్తుంది.

ఫైండ్ ఎక్స్‌2 ఫోన్‌లో 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీని, ఎక్స్2 ప్రొలో 4260 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. వీటికి 65 వాట్ల సూప‌ర్ వూక్ 2.0 ఫ్లాష్ చార్జ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీని వ‌ల్ల కేవ‌లం 35 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా చార్జింగ్ అవుతుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్‌2, ఫైండ్ ఎక్స్2 ప్రొ స్పెసిఫికేష‌న్లు…

* 6.7 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే
* 3168 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* హెచ్‌డీఆర్ 10 ప్ల‌స్‌, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ష‌న్‌
* 2.84 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్
* ఫైండ్ ఎక్స్‌2 – 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్
* ఫైండ్ ఎక్స్‌2 ప్రొ – 12జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్
* ఫైండ్ ఎక్స్‌2 – 48, 12, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* ఫైండ్ ఎక్స్2 ప్రొ – 48, 48, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* ఫైండ్ ఎక్స్‌2 – స్ప్లాష్ రెసిస్టెన్స్
* ఫైండ్ ఎక్స్‌2 ప్రొ – వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్
* యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్
* 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1
* ఫైండ్ ఎక్స్‌2 – 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* ఫైండ్ ఎక్స్2 ప్రొ – 4260 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* 65 వాట్ల సూప‌ర్ వూక్ 2.0 ఫ్లాష్ చార్జ్

ఒప్పో ఫైండ్ ఎక్స్‌2 సెరామిక్ బ్లాక్‌, ఓషియ‌న్ గ్లాస్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా దీని ధ‌ర రూ.64,990గా ఉంది. ఇక ఒప్పో ఫైండ్ ఎక్స్‌2 ప్రొ సెరామిక్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్‌లోనే విడుద‌లైంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇక ఈ ఫోన్లు త్వ‌ర‌లో వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version