మస్క్ టార్గెట్ ఎఫెక్ట్.. ఆఫీసులోనే నిద్రిస్తున్న ఉద్యోగులు

-

ఎలాన్ మస్క్ ట్విటర్ ను సొంతం చేసుకున్నప్పటి నుంచి సంస్థలో పెను మార్పులు చేసుకుంటున్నాయి. బడా బడా స్థానాల్లో ఉన్న వారిని తొలిగించి ట్విటర్ ను సమూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు మస్క్. అయితే మస్క్ ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి అక్కడి ఉద్యోగులు ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తోందని ప్రచారం జరుగుతోంది. కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన మస్క్.. ఉద్యోగులకు డెడ్ లైన్ తో కూడిన టార్గెట్లను నిర్దేశించినట్లు ఇటీవల పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఓ ట్విటర్‌ ఉద్యోగి పోస్ట్‌ చేసిన ఫొటో వైరల్‌గా మారింది.

ట్విటర్‌లో ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ ఎస్తర్‌ క్రాఫోర్డ్‌ ఆఫీసులోనే నేలపై నిద్రిస్తున్న ఫొటోను ఇవాన్‌ అనే ఉద్యోగి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ట్విటర్‌ బాస్‌ నుంచి ఏదైనా కోరుకున్నప్పుడు ఇలా ఉండాల్సిందే’’ అని దానికి క్యాప్షన్‌ తగిలించాడు. ట్విటర్‌లో ఉద్యోగుల తొలగింపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే ఈ ఫొటో దర్శనమివ్వడంతో వెంటనే వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version