కార్తీకదీపం ఎపిసోడ్ 1147: ‘కాకి మెడేసుకుని చూసింది చాలు పోవే రొట్టమొఖమా’ అంటూ కోర్టులో మోనితకు చివాట్లు పెట్టిన దీప

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్ లో రోషిణీ వచ్చి రత్నసీతతో కేడీ లేడీని కోర్టుకు తీసుకెళ్లాలి గుర్తుందా అని అడుగుతుంది. గుర్తుంది అంటుంది రత్నసీత. పక్కనే ఉన్న మోనిత రోషిణీ వెహికల్ లో రావటానికి పర్మిషన్ అడుగుతుంది. ఎందుకు నా రివాల్వర్ లో బులెట్ లో మాయం చేసి నేనే చెంపా అని చెప్పడానిగా అంటుంది రోషిణి. చచ్చినపాముని ఇంకా చంపకండి మేడమ్ అంటుంది మోనిత. నేను చేసిన నేరాలకు నాకు ఉరిశిక్ష అయినా పడొచ్చు, చనిపోయేముందు చివరికోరిక ఏంటి అని అడుగుతారు కదా అదే కొంచెం ముందుకు తీసుకుచ్చి ఇప్పుడే అడుగుతున్నాను నా కోరిక మీతో కలిసి కోర్టుకు రావటం అంటుంది మోనిత. నా సంగతి నీకు తెలియదు దారిలో బుసలు కొట్టే ప్రోగ్రామ్ ఏమైనాపెట్టుకున్నావా, కుపుసం వొల్చేస్తాను, కోరలు పీకేస్తాను అని తీసుకురండి అంటుంది. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.

కార్తీకదీపం | Karthika Deepam

హిమ, శౌర్యాలు దీప అబద్ధం గురించి మాట్లాడుకుంటారు. శౌర్య చాలా కోపంగా ఉంటుంది. ఇంతలో పై నుంచి దీప, కార్తీక్ వస్తారు. వాళ్లను చూసిన దీప.. కార్తీక్ తో మెల్లిగా వీళ్ల ప్రశ్నలకు జవాబులు చెప్పలేం, అబద్ధము చెప్పలేం అంటుంది. కార్తీక్ ఏంటే రౌడీ టోల్ గేట్ లా అడ్డంగా కుర్చుకున్నారు అంటారు. మీరు వస్తారు అని తెలియదు కదా అందుకే కుర్చున్నాం అంటారు. క్రికెట్ ఆడదాం రండి నాన్న అంటుంది శౌర్య, మేము ఓ పని మీద బయటకికి వెళ్తున్నాం అంటాడు కార్తీక్. వాళ్లు వస్తాం అంటారు. మొత్తానికి కార్తీక్ మ్యానేజ్ చేసి పిల్లలను ఒప్పిస్తాడు. ఇంతలో సౌందర్య వచ్చి తమరికి ఈ మధ్య మీ అమ్మ ఏం చెప్పినా అబద్ధమే కనిపిస్తుంది. శౌర్య అబద్ధమే చెప్తుందిగా అంటుంది. సౌందర్య కోప్పడి నువ్వు ఆ బస్తీలో పెద్దవాళ్లతో స్నేహం చేసినట్లు ఉన్నావ్ అన్నీ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నావ్, మీ నాన్న కోర్టునుంచి బయటకు వచ్చాడంటే అందుకు కారణం నా కోడలు అంటుంది శౌర్య..ఆ మాటకు పిల్లలు ఇద్దరు కార్తీక్, దీపలను కౌగిలించుకుంటారు. సరే వెళ్తొస్తాం అని కార్తీక్ ఒక అడుగుముందుకేస్తాడు..శౌర్య చేయిపట్టుకుంది. ఏంట్రా అంటే, నువ్వు బయటకువెళ్తుంటే నాకెందుకో బయమేస్తుంది, నీకు మళ్లీ ఏమన్నా అవుతుందా, మళ్లీ ఇంటికొచ్చేస్తావ్ కదా, నిన్ను పోలీసులు పట్టుకెళ్ళరుగా అని అ‍డుగుతుంది. కార్తీక్ శౌర్యకు ధ్రైర్యం చెప్పి వెళ్తారు.

ఇటుపక్క మోనిత కోర్టుకు రోషిణీ కారులో వస్తూ ఉంటుంది. మోనిత మనసులో దీప వాళ్లు నేను వీఐపీలాగా ఏసీపీ కారులో దిగటం చూసి అద్దిరిపోతారు అందుకేగా కాకపట్టి ఈ కారులో వస్తుంది ఈలోపు రెండు బిస్కెట్లు వేద్దాం అనుకుంటుంది. రోషిణీని పిలిచి నేను మీ అభిమానిని మేడమ్ అంటుంది. ఫైర్ బ్రాండ్ రోషిణీ..ఎన్ని బిస్కెట్లు వెంట తెచ్చుకున్నావ్ మోనిత అని ఎటకారంగా అడుగుతుంది. మోనిత మనసులో నేను బిస్కెట్లు వేయాలనుకున్నట్లు ఈవిడ ఎలా కనిపెట్టింది అనుకుని..ఏంటి మేడమ్ నేను మిమ్మల్ని పొగడుతుంటే బిస్కెట్ అంటున్నారు అని అడుగుతుంది. మోనిత క్రిమినల్ బ్రెయిన్ గురించి, చేసిన ఘోరాలు గురించి చెప్పి అలాంటి నువ్వు నాకు అభిమానిని అని చెప్పినంత మాత్రనా కరిగిపోయి దారిలో దింపేస్తా అనుకున్నావా అని అంటుంది. మోనిత మాత్రం మీరు నన్ను టోటల్ గా మిస్ అండ్ స్టాండ్ చేసుకున్నారు. మీరు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటుంది. రోషిణీ మోనితను చెడమడ తిడుతుంది. దీప, కార్తీక్, సౌందర్య వాళ్లను పొగడ్తుంది. మోనిత ఏడుస్తుంది. రోషిణీ ఏడవ్వకు, దెయ్యం సినిమాలో స్మశానం మీద కుర్చుని దెయ్యం ఏడుస్తున్నట్లు ఉంది అంటుంది.

ఇలా రోషిణీ మోనితను తన చేసిన పాపాలను గుర్తుచేసి తిడుతూ ఉంటుంది. మోనిత మాత్రం వీరలెవల్ లో యాక్ట్ చేస్తుంది. అయిపోయింది, నా జీవితంలో కార్తీక్ అధ్యాయం ముగిసింది. నా ప్రేమను ఎ‌వరు అర్థం చేసుకుంటారు. అంటూ నాలుగు సెంటిమెంట్ డైలాగ్స్ వేస్తుంది. రోషిణి మాత్రం ఎక్కడా కంప్రమైజ్ కాదు. నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడుగుతుంది. మోనిత వైరాగ్యం వచ్చినట్లు మాట్లాడుతుది. రోషిణీ చిర్రెత్తిపోయి, ఇంతకు మించి ఒక్కమాట నీ గురించి పాజిటివ్ గా మాట్లాడితే చేతికి హ్యాండ్ కప్స్ వేసి రోడ్డుమీద ఈడ్చుకుంటూ వెళ్తాను అంటుంది.

కోర్టులో దీప, కార్తీక్, సౌందర్య వాళ్లు ఉంటారు. మోనితసురవధ నాటాకానికి వచ్చినట్లు ఉంది అని సౌందర్య అంటుంది. ఇంకాసేపట్లో నవరసాలు పండిస్తుందని దీప, ప్రపంచంలో తనంత అమాయకురాలు ఎవరు లేరనట్లు యాక్ట్ చేస్తుందని కార్తీక్ అంటాడు. ముందు ఎంతోకొంత శిక్ష వేసి దాన్ని జైలుకి పంపితే తప్ప దరిద్రం వదలదు అని సౌందర్య అంటుంది.
కోర్టుకు వస్తుంది మోనిత. వాళ్లను చూసిన దీప పాపి చిరాయువు అదిగో వస్తుంది అంటుంది. వాళ్లను చూసిన మోనిత, కారు దిగటం కూడా చూసిఉంటే కళ్లల్లో నిప్పులు పోసుకుని ఉండేవాళ్లు అనుకుంటుంది. నమస్కారం అందమైన అత్తగారు అంటు ఎటకారంగా అంటుంది. సౌందర్య కొట్టడానికి వెళ్తుంది, దీప ఆపుతుంది. రోషిణీ..మీరేమి చేయకండి సౌందర్యగారు, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని రుజువైంది కదా, ఇంకాసేపట్లో ఈ మోనిత జాతకం బయటపపడిపోతుంది అంటుంది. ఆ మాటకు కార్తీక్, దీప, సౌందర్య వాళ్లు నవ్వుతారు. అబ్బా మోహాలు చూడండి చిచ్చుబుడ్డుల్లా వెలిగిపోతున్నాయ్ అంటుంది మోనిత. కార్తీక్ ఒకసారి అటుచూడు ఈమె నా భార్య దీప, నువ్వు మమ్మల్ని విడదీయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన మేము విడిపోలేదు అది భార్యభర్తల బంధం అంటే అంటాడు కార్తీక్, మమ్మల్ని విడదీయటానికి మాయా గర్భం తెచ్చుకున్న నీ లాంటి దానికి భార్యభర్తల బంధం గురించి ఏం తెలుస్తుందిలే అని దీప అంటుంది. వెళ్లి బోనులో నిలబడు అంటుంది. ఇలానే తాలఓమాట అని సాగిదీస్తారు. నువ్వు చేసిన నేరాలకు, నువ్వు చేసిన పాపాలకు తగిన శిక్ష పడే సమయం వచ్చింది అది కల్లారా చూడ్డానికే వచ్చాం అంటుంది సౌందర్య. రోషిణి సరిపోయిందా..నేను కారులో పెట్టిన గడ్డి చాల్లేదా..ఇక్కడ కూడా గడ్డి తినాలనిపించిందా అని అంటుంది. నడువ్ అంటుంది. యహ్ కాకిమెడ ఏసుకుని చూసింది చాలు పోవే రొట్టమొఖమా అంటుంది దీప. మోనిత నాలుగు అడుగులు మందుకు వేసి మళ్లీ వెనక్కు వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version