కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కింద సౌందర్య ఇంకా గ్యాంగ్ అంతా మాట్లాడుకుంటారు. లోకానికి నచ్చచెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో పిల్లలకు మాత్రం నచ్చచెప్పాలి అంటుంది. ఆ మాటకు ఆదిత్య నచ్చచెప్పటం అంటే మళ్లీ ఇంకో అబద్ధం చెప్పటమా అంటాడు. ఆదిత్య పిల్లలు నిజం చెప్పమంటాడు. కానీ దీప, ఆనంద్ రావులు మాత్రం వాళ్లు పిల్లలకు నిజం ఎలా చెప్తాం రా అంటారు. ఇంతలో కార్తీక్ కిందకు వస్తాడు. సౌందర్య పేపర్ లో మోనిత ఆర్టికల్ హిమ చూసిందని చెప్తుంది. కార్తీక్ వాట్ అలా ఎలా చూస్తారు నువ్వేం చేస్తున్నాం దీప అంటాడు. నేను దాచిపెట్టాను కానీ చూసేసారు అని మిమల్ని కలిసి వెళ్దామని హాస్పటల్ కి వచ్చిందంట. మీరు ఆపరేషన్ థియేటర్ లో బిజీగా ఉన్నారని వచ్చేసిందంట అని చెప్తుంది. కార్తీక్ కి మోనిత అన్న మాటలను హిమ వినేసిందా అని డౌట్ వస్తుంది. సౌందర్య హిమకు నువ్వంటే వల్లమాలిన ప్రేమరా, వెళ్లి కొంచెం సేపు బతిమిలాడితే అదే మాట్లాడుతుంది అంటుంది. హిమ నాతో మాట్లాడకపోతే బతిమిలాడుకుంటాను, లేకపోతే దాని కాళ్లైనా పట్టుకుంటాను అంటాడు. పుట్టినరోజునాడు ఏంటి ఆ మాటలు అంటే..కార్తీక్ హిమతో మాట్లాడటానికి బయటకు వెళ్తాడు. ప్రియమణి ఈ సీన్ అంతా చూస్తూ విలన్ లుక్స్ ఇస్తూ ఉంటుంది.
ఇంకోసీస్ లో భాగ్యం భర్త మురళీకృష్ణ నిద్రపోతూ ఉంటాడు. ఏంటి భాగ్యం ఇంకా లేవలోదా.ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చాక గురకపెట్టి నిద్రపోతుందేమో అనుకుంటాడు. ఇంతలో భాగ్యం సౌండ్..ఏంటిది అనుకుంటూ ఇంటి సభ్యులు ఇంకా లేవలేదా, నేను జట్టునాయకురాలని కావొద్దని మీ అందరికి ఉందికదా, ఈ ఇంటిని శుభ్రంగా ఉంచాలని తెలియదా అంటుంది. ఇలా భాగ్యం బిగ్ బాస్ హోస్ లో లాగా మాట్లాడుతుంది. భలే కామెడిగా ఉంటుంది. మురళీకృష్ణకు ఏం అర్థంకాదు. ఇంకా ఆ ఇంటిలోనే ఉన్నట్లు ఉందే అనుకుంటుందేమో..ఎప్పుడు మాములు మనిషి అవుతుందో అనుకుంటాడు.
హిమ నువ్వే తప్పు చేశావ్, నీకోసమే మోనిత ఆన్టీ జైలుకి వెళ్లింది అంటాడు. పాపం ఆ మాటకు కార్తీక్ మోకాళ్లమీద కుర్చుని నువ్వు తప్పుగా అర్థంచేసుకుంటునావమ్మా అంటూ దన్నం పెడతాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయిభాగంలో హిమ దీపతో నాకు ఈ ఇల్లు నచ్చటం లేదమ్మా, బస్తీకి వెళ్లిపోదాం అంటుంది. దీప కార్తీక్ దగ్గరకు వచ్చి హిమను నొప్పించలేకపోతున్నాను అంటూ ఏడుస్తుంది. దీన్నిబట్టి మళ్లీ బస్తీప్లాన్ చేశారేమో..ఇప్పటివరకూ దీప వెళ్తా అనేది, ఇప్పుడు హిమ. ఇంకా ఈ ప్రియమణి మొత్తం చూస్తూనే ఉంటుంది. మోనితకు మోస్తుంది జరిగిందంతా.