కార్తీకదీపం ఎపిసోడ్ 1196 : మోనితకు ముచ్ఛెమటలు పట్టించిన దీప.. నా దమ్ము ఏంటో త్వరలోనే చూపిస్తానని సవాల్

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో వంటలక్క రోడ్డుపై నడుస్తూ..అసలు నేను సాధించింది ఏంటి, నా జీవితానికి అర్థం ఏంటి, పుట్టించి నుంచి ఎలాంటి భరోసా లేదు, మెట్టింటి నుంచి ఎలాంటి నమ్మకం లేదు, అందరూ నన్ను మోసం చేస్తున్నారు, అందరూ బాగానే ఉన్నారు, నేను లేకపోయినా బాగానే ఉంటారు, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నేను ఎవరికి అవసరం లేదు, పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు, వాళ్లకి అందరూ ఉన్నారు అనుకుని ఏడ్చుకుంటూ వచ్చి ఒక చెట్టుకింద కుర్చుంటుంది. మోనిత గుర్తుకువచ్చి అవును ఇదే కరెక్టు అనుకుని ఏంటో ధైర్యంగా లేచి నడుస్తూ..ఒక ఆటోను ఆపుతుంది. చివరిసారిగా ఒకచోటుకు వెళ్లాలి అంటుంది. ఆటోలో మోనిత ఇంటికే బయలుదేరుతుంది.

మోనిత ఇంట్లో ప్రియమణిని పిలిచి నేను గెలిచినాను ప్రియమణి, ఆల్ మోస్ట్ అంతా అయిపోయింది, ఇంకా కొంచెం మాత్రమే మిగిలిపోయింది అంటూ వెర్రిదానిలా ఏదేదో మాట్లాడుతుంది. మూడు వంతులు అయిపోయింది, ఇంకా ఒక వంతు మాత్రమే మిగిలింది, దీప ఆ ఇంట్లోంచి వెళ్లటం..నేను ఆ ఇంట్లో కాలు పెట్టటం అంతే మిగిలింది అంటుంది దీప ఎదురుగా ఉంటుంది. మోనిత ప్రియమణి నేను ఏం చేస్తున్నాను, నా కళ్లు చూసేది నిజమేనా, దీపక్కా నా ఇంటికి వచ్చిందా, వెల్కమ్ స్వాగతం అని చెప్పటానికి రెడీగా ఏం లేవు, సారీ దీపక్కా ఏం అనుకోకే, నాదీ కొత్త సంసారమే కదా అంటుంది. దీప మోనిత దగ్గరకు వచ్చి నిలబడుతుంది. ఏంటి ఇలా వచ్చావ్, రణమా, రాయబారమా, అయినా ఇంత జరిగాక ఇంకా గొడవలు ఏముంటాయ్ లే, కాళ్లబేరానికి వచ్చావా అంటుంది. మోనిత నోరు అదుపులోకి పెట్టుకో అంటుంది మోనిత. నీకు ఇంకా ధైర్యం ఉందా..రాగానే బోరున విలిపస్తావ్ అనుకున్నానే, మొఖమాటపడుతున్నావా, ఇద్దరం బాగుండేలా, ఇద్దరికి నచ్చేలా వచ్చే ప్యాకేజ్ తో వచ్చావా దీపక్కా అంటూ..కార్తీక్ కోసం మోనిత ఎంతలా పరితపించిందో చెప్తూ…ఎంత విర్రవీగావ్ దీపక్కా, ఇలాగే గుడ్లు ఉరిమి చూస్తూ, కన్నుబొమ్మ పైకిత్తూ చూస్తూ ఎన్ని చేశావ్..అంటూ ఓ పేట్రేరేగిపోతుంది.

దీప అన్నీ సైలెంట్ గా వింటుంది. ఇప్పుడేమైంది దీపక్కా, అంతా తారుమారు అయిపోలా, కార్తీక్ తో బిడ్డను కన్నాను, దోషనివారణ పూజ చేయించాను, నా దోషాలు కూడా పోయాయ్, ఇంకేముంది దీపక్కా నీకు క్లోజ్ అంతా క్లోజ్..జైలుకు వెళ్లే ముందు ఏం చెప్పానో గుర్తుకువచ్చిందా దీపక్కా, నా సినిమాకు శుభం కార్డుపడబోతుంది, నీ సినిమా ఫ్లాప్ దీపక్కా..మోనితా కార్తీక్ ల ప్రేమాయణం సూపర్ హిట్ అయ్యింది, ఇప్పుడు ఏం చేస్తావ్ దీపక్కా, ఏ నుయ్యో గొయ్యే అంటుంది. దీప మోనిత అని గట్టిగా అరుస్తుంది.

అవును మోనితనే..ఇప్పుడు అరిచి ఏం చేస్తావ్, నీకు బలం లేదు, నీ బలాన్ని బలగాన్ని నేను లాగేసుకుంటున్నాను, ఏముంది దీపక్కా నీ దగ్గర బూడిద తప్ప అని ప్రియమణితో కలిసి కాసేపు వెటకారం చేస్తుంది. ఏం చేస్తావ్, ఏం చేసి బతుకుతావ్, వంటలక్కవి కదా పాత జీవితం మొదలుపెడతావా, మిక్సీ గ్రైండర్ కి సాయం కావాలంటే నేను చేసిపెడతాలే అని వెళ్లేప్పుడు దోషనివారణ ఫొటోలు తీసింది ప్రియమణి తీసుకెళ్లు అంటుంది. ఇలా ఏదేదో వాగుతూనే ఉంటుంది.

దీప ఫైనల్ గా దర్జాగా సోఫాలో కుర్చోని ఓ లుక్క్ ఇస్తుంది. ఇప్పుడు దీప మాట్లాడటం స్టాట్ చేస్తుంది. జైలుకూడు బాగానే వంటపట్టినట్లుంది, అరిచిఅరిచి గొంతు ఏండిపోయిందేమో పాపం, ప్రియమణి నీళ్లు తెచ్చి ఇవ్వు అని..ఇంకేంటి సంగతులు, నీ ఆరోగ్యం బాగానే ఉందా, బాగానే కనిపిస్తున్నావ్ లే అంటుంది. దీప ఇలా చేయటంతో మోనితకు మైండ్ బ్లాక్ అవుతుంది. కూర్చో మోనిత కూర్చో అని పక్కన కుర్చోపెట్టుకుంటుంది. నీకు ఓ పిట్టకథ చెప్తాను అని దీప ఏదో కథ చెప్తుంది. గాడిద స్టోరీ చెప్పి మొత్తానికి మోనితను అడ్డగాడిదతో పోలిస్తుంది..నీ కథ కంచికి చేరిందని..శుభం కార్డుపడిందని నువ్వు అనుకోకూడదు దేవుడిచ్చిన చెల్లమ్మా..అలా నేను అనుకోవాలి, నాకు దిక్కులు దారులు మూసుకుపోలేదు, నీ కళ్లు మూసుకుపోయిలా అలా మాట్లాడుతున్నావ్ అని , నేను వంటలక్కనే ఏది ఎప్పుడు ఎంత వేయాలో నాకు బాగా తెలుసు, నీ ఇంటికి వచ్చి నిన్ను బతిమాలి, కళ్లనీళ్లు పెట్టుకుంటాను అని కలలు కన్నావ్ కదా..పరిస్థితులు అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయని, గెలిచానని విర్రవీగుతున్నావ్ కదా, అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది మోనిత, నీ క్రిమినల్ బ్రెయిన్ కి అందని విధంగా ఉంటుంది చూడు, నా వైపు ఎవరున్నారు అన్నావ్ కదా.. గుండె ధైర్యం ఉంది.. ఆ ధైర్యం ఏంటో నా దమ్ము ఏంటో నీకు అతి త్వరలోనే తెలుస్తుంది అంటుంది దీప..మోనితకు దీప మాట్లాడే ప్రతిడైలాగ్ కి దిమ్మతిరిగిపోతుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
-triveni

Read more RELATED
Recommended to you

Exit mobile version