కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఇంటికి వచ్చిన దీప అందరిని పలకరిస్తుంది. అక్కడున్నవాళ్లకు అది కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది. అన్నీ ఏర్పాట్లు చేశావా, పంతులుగారు, వంటలుచేశావా అని దీప అంటే..పంతులుగారు ఓకే, వంటలే క్యాటరింగ్ వాళ్లు సగం ఇవ్వలేదు అంటుంది మోనిత. అదేంటి మోనిత..అసలే నీ కార్తీక్ వస్తున్నాడు., అత్తయ్యగారు వస్తున్నారు..అత్తయ్యగారేంటి..మీ అత్తయ్యాగారు వస్తున్నారు, వాళ్లకు ఇష్టమైనవి ఏమైనా చేయించావా లేదా, వాళ్లకు ఇష్టమైనవి చేయిస్తే వాళ్లమనసు దోచుకోవచ్చు, వంటలదేం ఉందిలే మొనిత ..నేను వంటలక్కనేకదా చిటికెలో చేసేస్తాను అని వంటగది ఎక్కుడుందో చూపించు అంటుంది. మోనితకు, పక్కన ఉన్న భారతీకి ఏం అర్థంకాదు. మోనిత దీపను వంటగదిలోకి తీసుకెళ్తుంది. అదంతా చూస్తున్న స్టాఫ్ ఆవిడ కార్తీక్ గారి మొదటిభార్యకదా అంటే..అవును రాజీపడినట్లు ఉన్నారు, అయినా పెద్దగా చదువుకోలేదంటగా అంటుంటారు.
వీళ్లు దీప కనిపించటంలేదేంటండి అని చూస్తారు. అప్పుడే మెట్లపై నుంచి దిగుతున్న మోనిత దీపక్కా అని పిలుస్తుంది. దీప సరిగ్గా వంటలక్క గెటప్ లో గరెట తీసుకుని వస్తుంది. అది చూసిన కార్తీక్ వాళ్లు షాక్ అవుతుారు. కార్తీక్ దీప ఏమైంది నీకు, ఇక్కడికి రావటమేంటి అని అరుస్తాడు. దీప మాత్రం కూల్ గా రండిరండి పాపం మీరు రారేమో అని మోనిత బాగా టెన్షన్ పడింది అంటుంది దీప,అలా చూస్తావేంటి మోనిత వెళ్లు వచ్చినవాళ్లని ఆహ్వానించవా అంటుంది. మోనిత మనసులో దీపక్క డిసైడ్ అయినట్లు ఉంది వెళ్లటానికి థ్యాంక్యూ దీపక్కా అనుకుంటుంది. కార్తీక్ ఆవేశంగా వచ్చి దీప నీకు ఇక్కడేం పని, నువ్వు వంటలు చేయటమేంటి అని గరెట తీసి విసిరేసి, పద వెళ్దాం అంటాడు. దీప మాత్రం వంటలక్క చేసేది వంటలే కదా డాక్టర్ బాబు, ఏంటి మోనిత అలా చూస్తున్నావు, బాబును ఉయ్యాలోవెయ్యి, బారసాల కానివ్వు అని హడావిడి చేస్తుంది. మోనిత పైకి నవ్వుతున్నా, లోపల మాత్రం దీపక్క ఈ కథకు ఈరోజు ఏదో క్లైమాక్స్ ఇవ్వబోతున్నట్లే ఉంది అనుకుంటుంది.
అది జరిగింది..ఇందులో ఇంకా ఇంకా చాలా మలుపులు ఉన్నాయి, ఈ విధంగా నేను మోనితకు దేవుడిచ్చిన అక్కను అయ్యాను అనమాట, జరగిన కథ అదైతే..జరుగుతున్న కథమరోలా ఉంది, ముఫ్పై రూపాయలుపెట్టి మూరెడు పుసుపుతాడు కొనుక్కోని తనకు తానే మెడలో వేసుుకంది ఇది తాలి ఎలా అవుతుంది పంతులుగారు, దొంగమాటలు చెప్పటం, దొంగసాక్షాలు చెప్పటం, దొంగతనంగా ల్యాబ్ నుంచి శాంపిల్ కొట్టేయటం అంటుంది. దీప మాటలకు మోనిత బిత్తరపోయి చూస్తుంది. ఈలోపు ఎపిసోడ్ ముగుస్తుంది. ఈరోజు కాస్త ఇంట్రస్టింగ్ గానే ఉంది. రేపు ఇంకా ఉంది అసలు కథ..