తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అసలు టీఆర్ఎస్‌కు ఎక్కడకక్కడ చెక్ పెట్టేందుకు ఊహించని వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఇదే క్రమంలో శత్రువులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ఒకో సందర్భంగా రాజకీయంగా ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది. పై స్థాయిలో కాకపోయినా కింది స్థాయిలో అవసరాన్ని బట్టి నేతలు కలిసిపోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయని విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ కొన్ని చోట్ల పోటీకి దిగింది. కానీ కాంగ్రెస్‌కు పూర్తి బలం లేదు…ఇండిపెండెంట్‌లు, క్రాస్ ఓటింగ్‌పైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అలాగే కొన్ని చోట్ల స్థానికంగా ఉండే బీజేపీ నేతలని ఒప్పించి…వారికి ఉన్న ఎంపిటిసి, జెడ్‌పిటిసిలని కాంగ్రెస్‌కు ఓటు వేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఉదాహరణకు మెదక్ స్థానంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు బలం తక్కువే…కానీ ఇండిపెండెంట్లు, బీజేపీ మద్ధతు కూడా దొరికితే టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఎలాగో హుజూరాబాద్‌లో సహకరించాం కదా…ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు, బీజేపీతో మంతనాలు సాగిస్తున్నారట. మరి బీజేపీ మద్ధతు దొరికితే కాంగ్రెస్….టీఆర్ఎస్‌కు చెక్ పెట్టగలదో లేదో చూడాలి.