హెచ్1బీ వీసాలలో కీలక నిర్ణయం… వివరాలు ఇవే..!

-

అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసాల లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇక పూర్తి వివరాలని చూస్తే… విదేశీయులు ఉద్యోగాలు చేయాలంటే హెచ్1బీ వీసాలు తప్పకుండ ఉండాలి. లాటరీ పద్ధతిని ఉపయోగించి హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తున్నారు. అలానే వలసేతర వీసా అయిన హెచ్1 బీ వీసాల్ని ప్రతి యేటా 65 వేలు మంజూరు చేస్తుంటుంది అమెరికా ప్రభుత్వం.

ఉన్నత విద్య అభ్యసించిన విదేశీ విద్యార్ధులకు మరో 20 వేల వీసాలు ఇస్తుంటుంది. అయితే వీసాలు ఉంటే విదేశీయులకు పలు కంపెనీలు తక్కువ జీతానికే ఉద్యోగాలని ఇవ్వడం కారణంగా….అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పోతున్నాయని ఒక భావన ఏర్పడడం మూలాన కంప్యూటర్ ఆధారిత లాటరీ విధానానికి స్వస్తి చెప్పేసి… ప్రతిభ ఆధారంగా హెచ్1బీ వీసాలు ఇవ్వాలని ట్రంప్ అన్నారు.

ఈ ఏడాది అంటే 2021 మార్చ్ 9 నుంచి ఈ పధ్ధతి స్టార్ట్ అవ్వాలి కానీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కొత్త విధానాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేశారు. దీనితో ఇప్పుడు లాటరీ విధానం ద్వారానే వీసాలు ఇస్తున్నారు. దీనితో 2021 డిసెంబర్ 31 వరకూ మాత్రమే లాటరీ విధానం అమల్లో ఉండనుంది. అధికారులకు మరింత సమయం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version