సెప్టెంబ‌ర్‌లో బ్యాంకులకు ఎన్ని సెల‌వులో..

-

న‌గ‌దు వ్యవహారాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవ‌స‌రం. బిజినెస్ వ్యవహారాలు న‌డిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయ‌డం, డీడీలు జ‌మ చేయ‌డం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి ప‌ని దినమూ ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెల‌వుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబ‌ర్‌ నెలలోనూ బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మ‌రి ఈ నెల సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సెప్టెంబర్ నెలలోనే రెండు, నాలుగు శనివారాలైన 14, 28 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇక పోతే సెప్టెంబర్ నెలలో వచ్చే ఐదు ఆదివారాలు 1, 8, 15, 22, 29 తేదీల్లో ఎలాగో బ్యాంకులకు సెలవు. వీటికి అదనంగా బ్యాంకు ఉద్యోగులకు మరో రెండు రోజులు సెలవులు ఉన్నాయి.

2వ తేదీ సోమవారం వినాయక చవితి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అలాగే 10 తేదీ మంగళవారం మొహరం పండగ కారణంగా బ్యాంకులకు సెలవు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు వర్తిస్తాయి. ఇకపోతే ఒకవేళ బ్యాంకులకు సెలవులు ఉన్నా నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండ‌వు.

ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిథిగా కొనసాగుతాయి. ఏదైమైనా ఎప్పుడైనా బ్యాంక్ సెల‌వు ఉంటే.. అప్పుడు ఆయా రోజుల్లో ఏదైనా న‌గ‌దు లావాదేవీ వ్యవహారాలు ప్లాన్ చేసి ఉంటే దానికి త‌గ్గట్లుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version