జనవరి 1వ తేదీ వచ్చేస్తోంది.. వాహనదారులారా ఇది పూర్తి చేసారా..?

-

2021 జనవరి 1వ తేదీ.. కొత్త సంవత్సరం. కరోనా కారణంగా 2020 మొత్తం అనేక భయాందోళనలు కలిగాయి. కనీసం వచ్చే సంవత్సరం అయినా బాగా ఉంటుందన్న ఆశ అందరిలోనూ ఉంది. ఐతే వచ్చే సంవత్సరం అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చే ఏడాది 1వ తేదీ నుండి వాహనదారులకి కొత్త నియమాలు వచ్చాయి. కొత్త సంవత్సరానికి మరికొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ఈ కొత్త నియమాలు ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. సాధారణంగా రహదారుల మీద టోల్ ప్లాజాలు చాలా కామన్. ఒక చోటి నుండీ మరో చోటుకి ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నప్పుడు టోల్ చెల్లించాల్సి ఉంటుంది.

ఐతే ఈ టోల్ ప్లాజాల వద్ద చెల్లించే డబ్బు ఇకపై ఆన్ లైన్ ద్వారానే జరగనుంది. గతంలోనే ఫాస్టాగ్ అనే కొత్త పద్దతిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫాస్టాగ్ పద్దతి ద్వారా టోల్ అమౌంట్ డైరెక్ట్ ఆన్ లైన్ లోనే కట్ అవుతుంది. ఫాస్టాగ్ లేనట్లయితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ ఇకపై డబ్బులు కట్టడానికి అవకాశం లేదు. టోల్ ప్లాజా వద్ద నగదు రూపంలో టోల్ అమౌంట్ కట్టడానికి వీలు లేకుండా కేవలం ఫాస్టాగ్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

అందువల్ల ప్రతీ వాహనదారుడు తమ వాహనానికి ఫాస్టాగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ చేయించుకోని యెడల డబల్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుందట. జేబులో ఎన్ని డబ్బులున్నా ఫాస్టాగ్ తప్పనిసరన్న మాట. ఈ మేరకు వాహనదారుల కోసం టోల్ ప్లాజా కి ఒక కిలోమీటరు దూరంలోనే ఫాస్టాగ్ రీఛార్జ్ చేయించుకునే సౌలభ్యాన్ని అందుబాటులో ఉంచుతారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version